
ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా పడతాయి. దూర ప్రయాణాలు శ్రమతో కూడుకుంటాయి. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. పిల్లల ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. మిత్రులతో చిన్నపాటి విభేదాలు ఉంటాయి. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు తప్పవు.
ప్రయాణాల్లో అవరోధాలు కలుగుతాయి. చేపట్టిన పనులలో తొందరపాటు మంచిదికాదు. ప్రత్యర్థుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారాలు సాదాసీదాగా సాగుతాయి. ఉద్యోగాలలో ఊహించని ట్రాన్స్ ఫర్ లు ఉంటాయి. దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు.
దూరప్రాంత బంధు మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆర్థికంగా పురోగతి ఉంటుంది. కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. చేపట్టిన పనులు సజావుగా పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.
ఆదాయనికి మించి ఖర్చులుంటాయి. కొత్త అప్పులు చేస్తారు. బంధువులతో అకారణంగా విభేదాలు కలుగుతాయి. వ్యాపార, ఉద్యోగాల్లో ఆకస్మిక మార్పులు చికాకు తెప్పిస్తాయి. మానసిక ప్రశాంతతకు ఆలయ దర్శనాలు చేసుకుంటారు. చేపట్టిన పనులు మండకొడిగా సాగుతాయి.
ఇంటా బయటా అనుకూల పరిస్థితులు ఉంటాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకొని పాత విషయాలు చర్చిస్తారు. కొత్త పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు తొలగుతాయి.
వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. చేపట్టిన పనులలో శ్రమ పెరుగుతుంది. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ముఖ్యమైన పనులు కొన్ని వాయిదా వేస్తారు. మిత్రులతో కలహా సూచనలున్నాయి. వ్యాపారాలకు నిరాశ తప్పదు. ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు ఉంటాయి.
వృత్తి, ఉద్యోగాలలో మీ ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. రాజకీయ సమావేశాలకు ఆహ్వానాలు అందుతాయి. మొండి బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. పిల్లల చదువుకు సంబంధించి శుభవార్తలు వింటారు.
నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకొని విందు వినోదాల్లో పాల్గొంటారు. ఉద్యోగాల్లో పదోన్నతులు పెరుగుతాయి. వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. విలువైన వస్తు, వాహనాలు కొనుగోలు చేస్తారు.
కుటుంబ వాతావరణం చికాకుగా ఉంటుంది. ప్రయాణాలు వాయిదా పడుతాయి. ముఖ్యమైన పనులలో ఆటంకాలు కలుగుతాయి. సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు ఉంటాయి.
చేపట్టిన పనుల్లో ఆటంకాలు కలుగుతాయి. శ్రమతో కానీ పనులు పూర్తి కావు. భాగస్వామ్య వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు అధికారుల నుంచి విమర్శలు తప్పవు. వృథా ఖర్చులు పెరుగుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.
ముఖ్యమైన కార్యక్రమాల్లో విజయం సాధిస్తారు. కీలక సమయంలో సన్నిహితుల సాయం అందుతుంది. జీవిత భాగస్వామి నుంచి ఆకస్మిక ధన లాభం పొందుతారు. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి.
నిరుద్యోగులకు అందిన సమాచారం ఆనందం కలిగిస్తుంది. విందువినోదాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలలో అధిక లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాల్లో పాల్గొంటారు.