10.09.2025 బుధవారానికి సంబంధించిన మేష రాశి ఫలాలు ఇవి. నేడు మేష రాశివారికి ఆరోగ్యం, వ్యాపారం, ఉద్యోగాల్లో ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
నేడు మేషరాశి వారి జాతకం ఎలా ఉండనుంది? ఈ రాశివారికి కలిగే లాభాలు, నష్టాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్న వివరాలు ఇలా ఉన్నాయి. ఓసారి తెలుసుకుందామా...
25
ఆరోగ్యం
మేషరాశి వారికి నేడు ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. శ్రమ అధికంగా ఉండటం, దూర ప్రయాణాలు చేయాల్సి రావడం వల్ల శరీరానికి తగిన విశ్రాంతి లభించకపోవచ్చు. దీంతో అలసట, మానసిక ఆందోళనలు తలెత్తే అవకాశముంది. ముఖ్యంగా కుటుంబంలో పిల్లల ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉంది. చిన్న చిన్న విషయాలను నిర్లక్ష్యం చేయడం వల్ల అవి పెద్ద సమస్యలుగా మారవచ్చు.
35
ఆర్థిక పరిస్థితి
ఆదాయానికి మించి ఖర్చులు పెరగడం కొంత ఆందోళన కలిగించే అంశం. అనుకోని ఖర్చులు, అనవసర ఖర్చులు పెరగవచ్చు. పొదుపు దిశగా ప్రణాళికలు వేసుకోవడం ద్వారా ఈ స్థితిని కొంతమేర నియంత్రించుకోవచ్చు. అప్పులు చేయడం, పెద్ద పెట్టుబడులు పెట్టడం వంటి నిర్ణయాల్లో జాగ్రత్త అవసరం.
ఉద్యోగాల్లో ఒత్తిడి తప్పదు. సహోద్యోగులతో సంబంధాల్లో అపార్థాలు తలెత్తవచ్చు. పని భారం పెరుగుతుంది. పనిలో మెరుగైన ఫలితాల కోసం అదనపు శ్రమ అవసరం అవుతుంది. సాంకేతికంగా లేదా విధానపరంగా మార్పులు ఎదురయ్యే అవకాశం ఉంది. మేనేజ్మెంట్ నుంచి ఒత్తిడి, టార్గెట్లకు సంబంధించిన సమస్యలు ఎదురయ్యే అవకాశమున్నాయి.
55
వ్యాపారం
వ్యాపార పరంగా మేషరాశి వారికి కొత్త ఒప్పందాలు ఆలస్యంగా రావచ్చు. కీలకమైన నిర్ణయాలు వాయిదా పడే అవకాశముంది. భాగస్వాములతో చిన్నపాటి విభేదాలు తలెత్తవచ్చు. నూతన పెట్టుబడులు, ఒప్పందాల విషయంలో త్వరిత నిర్ణయాలు తీసుకోకుండా విశ్లేషణ చేసి ముందుకెళ్లడం మంచిది.