జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జూన్ 20న సూర్యుడు, అంగారక గ్రహాలు 30 డిగ్రీల దూరంలో ఉంటాయి. దీనివల్ల శక్తివంతమైన ద్వి ద్వాదశ యోగం ఏర్పడుతుంది. ఈ యోగం ప్రభావంతో మూడు రాశుల వారి జీవితం ఊహించని విధంగా మారుతుంది.
జ్యోతిష్య శాస్త్రంలో సూర్యుడిని గ్రహాల రాజుగా భావిస్తారు. సూర్యుడు ప్రతి నెలా తన రాశిని మారుస్తుంటాడు. దీని ప్రభావం 12 రాశి చక్రాలపై పడుతుంది. ఈ ప్రభావంతో కొన్ని రాశులవారికి మంచి ఫలితాలు రావచ్చు. మరికొన్ని రాశులవారికి చెడు ఫలితాలు రావచ్చు. సూర్యుడు ప్రస్తుతం మిథున రాశిలో ఉన్నాడు. జూన్ 20న అంటే.. రేపు శుక్రవారం నాడు సూర్యుడు, అంగారక గ్రహంతో కలిసి ద్వి ద్వాదశ యోగాన్ని ఏర్పరచనున్నాడు.
సూర్యుడు, అంగారకుడు 30 డిగ్రీల దూరంలో ఉండటం వల్ల ద్వి ద్వాదశ యోగం ఏర్పడుతుంది. దీనివల్ల కొన్ని రాశుల వారికి మేలు జరగనుంది. వారు పట్టిందల్లా బంగారం కానుంది. ఎప్పటినుంచో ఉన్న సమస్యలు పరిష్కారం కానున్నాయి. మరి ఏ రాశులవారికి ద్వి ద్వాదశ యోగం అదృష్టం తీసుకురానుందో.. అందులో మీ రాశి ఉందో ఓసారి చెక్ చేసుకోండి.
24
సింహ రాశి వారిపై ద్వి ద్వాదశ యోగం ప్రభావం
సింహ రాశి వారికి సూర్య-అరుణ(అంగారక) గ్రహాల ద్వి ద్వాదశ యోగం చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి పదకొండవ ఇంట్లో సూర్యుడు ఉంటాడు. దానివల్ల ఆదాయ మార్గాలు పెరుగుతాయి. మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది.
ఉద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది. కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు. సాలరీ పెరగడం లేదా పదోన్నతి పొందే అవకాశం ఉంది. సమాజంలో గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ప్రేమ జీవితంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోయి.. భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.
వ్యాపారులకు కూడా ఈ సమయం కలిసివస్తుంది. లాభాలు అందుకుంటారు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఆదాయం వస్తుంది. నిలిచిపోయిన డబ్బు చేతికివస్తుంది. మొండీ బాకీలు వసూలవుతాయి. ఇంటా బయటా సంతోషకర వాతావరణం ఉంటుంది.
34
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి సూర్య-అరుణ ద్వి ద్వాదశ యోగం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రాశి పదకొండవ ఇంట్లో అంగారకుడు, పన్నెండవ ఇంట్లో సూర్యుడు ఉంటాడు. కాబట్టి ఈ రాశి వారికి ఉద్యోగంలో మంచి ఫలితాలు ఉంటాయి.
ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది. తోటివారితో సఖ్యతగా ఉంటారు. సహోద్యోగుల సహకారంతో ఉద్యోగ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తారు. కొత్త ఉద్యోగాలకు అవకాశాలు కూడా లభిస్తాయి.
చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న కేసు మీకు అనుకూలంగా వస్తుంది. కుటుంబ వాతావరణం సంతోషంగా ఉంటుంది. వ్యాపారాలు లాభాల బాట పడతాయి. భాగస్వామ్య వ్యాపారాల్లో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. భూ సంబంధిత క్రయ, విక్రయాల్లోనూ లాభాలు వచ్చే అవకాశం ఉంది.
కన్య రాశి వారికి సూర్య-అరుణ ద్వి ద్వాదశ యోగం అదృష్టాన్ని తెస్తుంది. ఈ రాశి భాగ్య స్థానంలో అరుణుడు, పదవ ఇంట్లో సూర్యుడు ఉంటారు. దానివల్ల ఈ రాశి వారు మతపరమైన కార్యక్రమాలపై ఆసక్తిని పెంచుకుంటారు.
అంతేకాదు ఉద్యోగ బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తారు. కష్టంతో పాటు అదృష్టం తోడై మంచి ఫలితాలు పొందుతారు. ఉద్యోగంలో అనుకున్న పురోగతి సాధిస్తారు. మంచి పనితీరుతో ప్రశంసలు పొందుతారు.
ఎప్పటినుంచో పెండింగ్ లో ఉన్న పనులను చకచక పూర్తిచేస్తారు. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి. దైవ చింతన పెరుగుతుంది. కుటుంబంతో కలిసి పుణ్య క్షేత్రాలను సందర్శిస్తారు.