Shani Margi: గ్రహాలన్నింటీలో శనికి ఎంతో ప్రత్యేకత ఉంటుంది. అన్ని రాశులపై శని ప్రభావం పడుతుంది. అలాంటి శని నవంబర్ 28న మార్గీ స్థితికి వచ్చాడు. ఇంతకీ మార్గీ అంటే ఏంటి.? దీని ప్రభావం ఎలా ఉంటుంది.? ఇప్పుడు తెలుసుకుందాం.
శని నవంబర్ 28న మార్గీ స్థితికి వచ్చాడు. అంటే శని గ్రహం తిరిగి నేరుగా ప్రయాణం మొదలు పెట్టిందన్నమాట. జ్యోతిష్య సిద్ధాంతాల ప్రకారం ఇది కీలకమైన మార్పు. ప్రస్తుతం శని మీన రాశిలో ఉన్నాడు. ఈ మార్పు కొన్ని రాశులకు కఠినంగా ఉండొచ్చు కానీ మూడు రాశులకు మాత్రం మంచి ఫలితాలు దక్కే అవకాశం ఉంది.
25
శని 'చాందీ పాయా' అంటే ఏమిటి?
శని గోచారం జరుగుతున్న సమయంలో చంద్రుడు శని నుంచి 2, 5 లేదా 9వ భావంలో ఉంటే దాన్ని శని 'చాందీ పాయా' అంటారు. 2025 మార్చి 29న శని మీన రాశిలోకి వచ్చినప్పుడు కర్కాటక, వృశ్చిక, కుంభ రాశులు ఈ స్థితిలోకి చేరాయి. ఈ మూడు రాశులకు ఇప్పుడు శని మార్గీ అవ్వడం శుభఫలితాలు అందించే అవకాశాన్ని పెంచుతోంది.
35
కర్కాటక రాశి – ఉద్యోగం, ఆదాయంలో పెరుగుదల
కర్కాటక రాశి వారికి శని మార్గీ స్థితి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ జీవితంలో పదోన్నతి అవకాశం ఉంటుంది. ఆదాయంలో వృద్ధి కనిపిస్తుంది. పాత పెట్టుబడులు లాభం ఇవ్వొచ్చు. కొత్త సంపాదన మార్గాలు అందుబాటులోకి వస్తాయి. పని చేసే చోట మీ కృషిని గుర్తిస్తారు. పాత గొడవలు దూరమవుతాయి.
శని ఈ రాశిలో 'చాందీ పాయా'లో ఉన్నందున మార్గీ అవ్వగానే మంచి మార్పులు కనిపిస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్ అవకాశం, డబ్బుతో సంబంధం ఉన్న ఇబ్బందులు తగ్గుతాయి. అదే విధంగా ఆలస్యమైన పనులు పూర్తవుతాయి. వ్యాపారంలో పెరుగుదల, విదేశీ అవకాశాలు మెరుగవుతాయి.
55
కుంభ రాశి – ఆర్థికంగా బలపడే కాలం
కుంభ రాశి వారికి కూడా శని మార్గీ మంచి కాలం తెస్తుందని పండితులు అంటున్నారు. డబ్బు ప్రవాహం మెరుగవుతుంది. ఆర్థిక స్థిరత్వం పెరుగుతుంది. నిలిచిపోయిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ఉద్యోగం కోసం చూస్తున్నవారికి కొత్త అవకాశం లభిస్తుంది. వ్యాపారులు మంచి లాభాలు పొందే అవకాశం ఉంది.
గమనిక: పైన తెలిపిన విషయాలు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా అందించడమైంది. వీటిలో ఎలాంటి శాస్త్రీయత లేదని రీడర్స్ గమనించాలి.