ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
213
మేష రాశి ఫలాలు
దూర ప్రయాణాల వల్ల శారీరక శ్రమ పెరుగుతుంది. రావాల్సిన సొమ్ము సకాలంలో చేతికి అందదు. వృథా ఖర్చులు పెరుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో ఆటుపోట్లు తప్పవు. బంధువులతో అకారణంగా మాట పట్టింపులుంటాయి. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు.
313
వృషభ రాశి ఫలాలు
ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. వ్యాపార, ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. సన్నిహితులతో సఖ్యతగా వ్యవహారిస్తారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వృత్తి, వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు.
ఆరోగ్య పరంగా చికాకులు తప్పవు. వ్యాపారాలలో జాగ్రత్త అవసరం. చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు ఉంటాయి. ఇంటా బయటా బాధ్యతలు పెరుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఇతరులకు డబ్బు విషయాల్లో మాట ఇవ్వడం మంచిది కాదు. ఉద్యోగుల కష్టం ఫలించదు.
513
కర్కాటక రాశి ఫలాలు
ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలలో ముందడుగు వేస్తారు. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. దూరపు బంధువుల నుంచి అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది. స్నేహితులతో వివాదాలు తొలగిపోతాయి.
613
సింహ రాశి ఫలాలు
ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు. బంధు మిత్రుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఆదాయం సంతృప్తినిస్తుంది. సోదరులతో శుభాకార్యాల గురించి చర్చిస్తారు.
713
కన్య రాశి ఫలాలు
దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి. ఇంటా బయటా బాధ్యతలు ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన వల్ల మానసిక ప్రశాంతత లోపిస్తుంది. చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో సమస్యలు అధికామవుతాయి.
813
తుల రాశి ఫలాలు
చిన్న పాటి అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. బంధు మిత్రులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వ్యాపార, ఉద్యోగాలలో ఊహించని మార్పులుంటాయి. కొన్ని కార్యక్రమాలు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది. రెండు రకాల ఆలోచనల వల్ల డబ్బు నష్టం తప్పదు.
913
వృశ్చిక రాశి ఫలాలు
ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. నిరుద్యోగులు నూతన ఉద్యోగ అవకాశాలు పొందుతారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. నూతన కార్యక్రమాలు చేపడతారు. వృత్తి వ్యాపారాలలో మీ అంచనాలు నిజమవుతాయి.
1013
ధనుస్సు రాశి ఫలాలు
వ్యాపారాలు గతం కంటే మెరుగవుతాయి. ఉద్యోగాల్లో అధికారుల అనుగ్రహం కలుగుతుంది. సంతాన విద్యా ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలం. గృహ నిర్మాణ పనులు ప్రారంభిస్తారు. చిన్ననాటి స్నేహితుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నాయి.
1113
మకర రాశి ఫలాలు
దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. సోదరులతో ఆస్తి వివాదాలు ఉంటాయి. వ్యాపార, ఉద్యోగాలలో ఊహించని ఇబ్బందులుంటాయి. నూతన రుణ ప్రయత్నాలు ఫలించవు. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది.
1213
కుంభ రాశి ఫలాలు
వృత్తి, వ్యాపారాలలో అంచనాలు నిజం కావు. సన్నిహితుల నుంచి ఊహించని విమర్శలు ఎదురవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక సమస్యలు తప్పవు. చేపట్టిన పనులలో కష్టానికి తగ్గ ఫలితం దక్కదు. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు.
1313
మీన రాశి ఫలాలు
వ్యాపార విస్తరణకు మిత్రుల సహాయం అందుతుంది. ఆదాయం గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. వృత్తి, ఉద్యోగాలలో మీ సేవలకు తగిన గుర్తింపు లభిస్తుంది. సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి.