సింహ రాశి..
సింహ రాశికి అధిపతి గ్రహాలకు రాజు అయిన సూర్యుడు. ఈ గ్రహం రాహువుకు శత్రువు. అందువల్ల, ఈ కాలంలో రాహువు శక్తి చాలా ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. సింహ రాశికి చెందిన వారు ఈ సమయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కునే అవకాశం ఉంది. కాబట్టి, ఈ రాశివారు ఈ సమయంలో తమ వాహనాలు, ఆదాయం పై ఎక్కువ దృష్టి పెట్టాలి. ఖర్చులు, పెట్టుబడులకు సంబంధించిన విషయాల్లో ఎక్కువ నష్టాలు వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా, రాహువు అశుభ ప్రభావం కారణంగా, సింహ రాశివారికి ఈ సమయంలో ఆత్మ విశ్వాసం తగ్గిపోతుంది. కెరీర్ కు సంబంధించి ఏదైనా పెద్ద అవకాశం వచ్చినా.. మళ్లీ చేతి నుంచి చేజారిపోయే ప్రమాదం కూడా ఉంది.