నెంబర్ 4...
ఏ నెలలో అయినా 4, 13, 22, 31 తేదీల్లో పుట్టిన వారంతా ఈ నెంబర్ 4 కిందకు వస్తారు. ఈ నెంబర్ కి అధిపతి రాహువు. వీరు వ్యూహకర్తలు. వీరు చాలా తెలివైన వారు. తమ మనసులో ఏముంది అనే విషయాన్ని పొరపాటున కూడా బయటకు తెలియనివ్వరు. వీరు బయటకు ఒకలా, లోపల మరోలా ఉంటారు. వీరికి ప్రత్యేకంగా ఒక సీక్రెట్ వరల్డ్ ఉంటుంది. ఈ తేదీల్లో పుట్టిన వారు ఆర్థిక విషయాలు, వ్యక్తిగత బంధాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. నమ్మకమైన స్నేహితులకు కూడా తమ అసలు రహస్యాలు చెప్పరు. ఇక.. వీరు మాటలతో గారడీ చేస్తారు. వీరి సీక్రెట్స్ బయట పెట్టరు. కానీ.. ఎదుటివాళ్లను ప్రశ్నలతో తికమక పెట్టి.. వారి మనసులోని సీక్రెట్స్ ని తెలుసుకుంటారు.