నిద్రలో మన మనసు మరో లోకంలో విహరిస్తుంది. ఆ ప్రయాణంలో కనిపించే దృశ్యాలే కలలు. కొన్ని కలలు మామూలుగా అనిపిస్తే, మరికొన్ని మనసులో గట్టి ముద్ర వేస్తాయి. ముఖ్యంగా కలలో డబ్బు, బంగారం కనిపిస్తే ఏమవుతుందనే సందేహం చాలామందిలో ఉంటుంది. ఇక్కడ క్లియర్ చేసుకుందాం.
భారతీయ సంస్కృతిలో కలలకు ప్రత్యేక స్థానం ఉంది. కలలను కేవలం ఊహలుగా కాకుండా, భవిష్యత్తుకు సూచనలుగా, మన అంతర్ మనసు ఇచ్చే సంకేతాలుగా భావిస్తారు. ముఖ్యంగా కలలో డబ్బు, బంగారం కనిపించడం అనేది చాలామందిని ఆలోచనలో పడేస్తుంది. ఇది శుభమా? లేక అశుభమా? నిజ జీవితంలో ఏదైనా మార్పు జరుగుతుందా? అనే ప్రశ్నలు మనసులో తలెత్తుతాయి. స్వప్న శాస్త్రం ప్రకారం కలలో కనిపించే ప్రతి వస్తువుకు ఒక అర్థం ఉంటుంది. ఆ వస్తువు కనిపించిన పరిస్థితి, మన భావోద్వేగాలు, కల వచ్చిన సమయం వంటివి దాని ఫలితాన్ని నిర్ణయిస్తాయి.
26
కలలో డబ్బు కనిపిస్తే?
స్వప్న శాస్త్రం ప్రకారం కలలో డబ్బు కనిపించడం నేరుగా ధన లాభానికే సూచన కాదు. డబ్బు.. సంపదకు మాత్రమే కాదు, విలువ, శక్తి, బాధ్యత, అవకాశాలకు కూడా ప్రతీకగా భావిస్తారు. కలలో మీరు డబ్బు పొందినట్లు కనిపిస్తే, అది త్వరలో మీ జీవితంలో కొత్త అవకాశాలు రావచ్చనే సంకేతంగా చెప్పవచ్చు.
ముఖ్యంగా ఎవరో మీకు డబ్బు ఇస్తున్నట్లు కనిపిస్తే, సమాజంలో గౌరవం పెరగడం, ఎవరో ఒకరి సహాయం లభించడం లేదా మీ ప్రతిభకు గుర్తింపు దక్కే సూచన కావచ్చు. అయితే అదే డబ్బును మీరు కోల్పోయినట్లు లేదా దొంగతనం అయినట్లు కలలో కనిపిస్తే, అది ఆర్థిక నష్టానికి మాత్రమే కాదు, మీ నమ్మకం లేదా విలువైన అవకాశాన్ని కోల్పోయే సూచన కావచ్చు.
36
డబ్బు లెక్కపెడుతున్నట్లు కల వస్తే?
కలలో మీరు చాలా డబ్బు లెక్కపెడుతున్నట్లు కనిపిస్తే, అది మీ మనసులో ఉన్న ఆర్థిక ఆలోచనలు, భవిష్యత్తుపై ఉన్న ఆందోళనలను ప్రతిబింబిస్తుంది. స్వప్న శాస్త్రం ప్రకారం ఇది నేరుగా శుభమో, అశుభమో కాకపోయినా.. మీరు జీవితంలో స్థిరత్వం కోసం ఎక్కువగా ప్రయత్నిస్తున్నారని సంకేతం. కొన్నిసార్లు కలలో నకిలీ డబ్బు కనిపిస్తే, అది మోసం, తప్పుడు హామీలు లేదా మీరు నమ్మిన వ్యక్తి నిజ స్వరూపం బయటపడే సూచనగా చెప్పవచ్చు.
ఇక బంగారం విషయానికి వస్తే, స్వప్న శాస్త్రంలో బంగారానికి చాలా బలమైన అర్థాలు ఉన్నాయి. బంగారం అనేది సంపదతో పాటు శుభం, పవిత్రత, దైవిక అనుగ్రహానికి ప్రతీక. కలలో బంగారు ఆభరణాలు, నాణేలు లేదా బంగారు కడ్డీలు కనిపిస్తే, సాధారణంగా అది శుభసూచకంగా పరిగణిస్తారు. ముఖ్యంగా కలలో బంగారం పొందినట్లు లేదా ఎవరో బంగారం బహుమతిగా ఇచ్చినట్లు కనిపిస్తే, జీవితంలో శుభకార్యాలు, గౌరవం, కుటుంబ సంతోషం లేదా ఆర్థిక స్థిరత్వం పెరగడం వంటి ఫలితాలు రావచ్చు.
56
బంగారం పోగొట్టుకున్నట్లు వస్తే?
బంగారం కూడా అన్ని సందర్భాల్లో శుభమే అనుకోవడం తప్పు. కలలో మీరు బంగారాన్ని కోల్పోయినట్లు, దాచిన బంగారం మాయం అయినట్లు లేదా బంగారం దొంగతనం అయినట్లు కనిపిస్తే, అది మీ జీవితంలో ముఖ్యమైన విషయంపై నిర్లక్ష్యం, భయం లేదా బాధ్యతల వల్ల కలిగే ఒత్తిడికి సంకేతంగా చెబుతారు. కొన్నిసార్లు కలలో చాలా భారంగా బంగారం మోస్తున్నట్లు కనిపిస్తే, అది సంపదతో పాటు బాధ్యతలు, ఒత్తిళ్లు కూడా పెరుగుతున్నాయనే భావాన్ని సూచిస్తుంది.
66
డబ్బు, బంగారం రెండూ కనిపిస్తే?
డబ్బు, బంగారం రెండూ కలిసి కలలో కనిపిస్తే, అది భౌతిక, మానసిక జీవితాల మధ్య సమతుల్యత అవసరమనే సూచన. మీరు కేవలం సంపద వెనకే పరుగెత్తుతున్నారా, లేక ఆధ్యాత్మికతను కూడా పట్టించుకుంటున్నారా అనే ప్రశ్నను మీ మనస్సు అడుగుతోందని అర్థం. అలాగే కల వచ్చిన సమయం కూడా ముఖ్యమే. తెల్లవారుజామున కనిపించిన కలలు ఫలించే అవకాశం ఎక్కువని, అర్థరాత్రి వచ్చిన కలలు ఎక్కువగా మన మనస్సులోని ఆలోచనల ప్రతిబింబమే అనే విశ్వాసం ఉంది.