
జోతిష్యశాస్త్రం మాదిరిగానే, న్యూమరాలజీ కూడా మన జీవితాలన్ని ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా మనం పుట్టిన తేదీ ఆధారంగా మన వ్యక్తిత్వం ఎలా ఉంటుంది? మన ఫ్యూచర్ ఎలా ఉంటుంది? ఎలాంటి రంగం ఎంచుకుంటే మన భవిష్యత్తు బాగుంటుంది అనే విషయాలు తెలుస్తాయి. న్యూమరాలజీ ప్రకారం, కొన్ని నిర్దిష్ట జన్మ తేదీల్లో పుట్టిన వ్యక్తులు సహజంగానే నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. వీరు ఏ పని చేసినా కచ్చితంగా విజయం సాధించగలరు. వారు ఏ రంగంలో అడుగుపెట్టినా.. ఆ రంగానికే వెలుగు తీసుకువస్తారు. అంతేకాదు.. వీరిలో ఎవరికీ తెలియని ఓ ఆకర్షణ శక్తి ఉంటుంది. అయస్కాంతంలా అందరినీ తమ వైపు ఆకర్షించగలరు. ముఖ్యంగా నాలుగు తేదీల్లో పుట్టిన వారిలో ఈ స్పెషల్ శక్తులు ఉంటాయి. మరి, ఆ తేదీలేంటో చూద్దామా...
ఏ నెలలో అయినా ఒకటో తేదీలో జన్మించినవారు సహజంగా నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. వారు ఏ విషయం అయినా స్వతంత్రంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. తమదైన శైలిలో ముందుకు సాగుతారు. ఈ తేదీలో జన్మించిన వారు ఏ రంగంలో అయినా సత్తా చాటగలరు.వీరు ఎవరిమీద అయినా ఆధిక్యత చూపించగలరు. అంతేకాదు.. వీరు చాలా చొరవతో ఉంటారు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా, ఎవరి మీద అయినా ఆధిపత్యం చూపించాలంటే అది వీరికే సాధ్యం అవుతుంది. ఇతరుల అభిప్రాయలను వీరు పెద్దగా పట్టించుకోరు. తాము చేయాలి అనుకున్నదే చేస్తారు. వీరు సొంతంగా ఆలోచించి తమకు నచ్చిన నిర్ణయాలనే తీసుకుంటారు. దాని వల్ల వీరిని అందరూ గౌరవిస్తారు. అంతేకాకుండా.. వీరి ప్రవర్తనతో అందరినీ ఆకట్టుకుంటారు. అయస్కాంత శక్తిని కలిగి ఉంటారు.
ఏ నెలలో అయినా 8వ తేదీలో జన్మించిన వారిలోనూ ఒకరకమైన అయస్కాంత శక్తి ఉంటుంది. దానితో వీరు అందరినీ ఆకర్షించేయగలరు. ఈ తేదీలో జన్మించిన వారు సంపద, శ్రమ, స్థిరత్వానికి ప్రతిరూపంగా నిలుస్తారు. వీరు ఎంతో శ్రమించి.. తమ లక్ష్యాలను చేరుకుంటారు. వ్యాపారం, ఆర్థిక వ్యవహారాల్లో మంచి అనుభవంతో అనుకొన్నవి సాధించగలరు. వీరు చాలా ఫోకస్డ్ గా ఉంటారు. ఏదైనా పట్టుదలతో నేర్చుకుంటారు. దీని వల్ల విజయం సాధించగలరు. ఈ సంఖ్యలో ఉన్న శక్తి వారిని పదే పదే గెలుపు దిశగా నడిపిస్తుంది. అయినప్పటికీ, వారు వినయంగా, సమతుల్యంగా ఉంటారు. స్థిరత్వంతో పాటు ఇతరులను గౌరవించగల నైపుణ్యం కూడా వీరు అభివృద్ధి చేసుకోవాలి.
ఏ నెలలో అయినా నెంబర్ 10వ తేదీన పుట్టిన వారిలోనూ చాలా గొప్ప లక్షణాలు ఉంటాయి. వీరిలో అయస్కాంత శక్తి ఉంటుంది. అందరినీ ఆకర్షించగలరు. ఈ తేదీలో జన్మించిన వారు వ్యూహాత్మక ఆలోచనలతో కూడిన నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. వారు తమ లక్ష్యాలను స్పష్టంగా గుర్తించగలరు. వాటికి తగిన మార్గాలను రూపొందించడం కూడా వీరి ప్రత్యేకత. వీరికి భవిష్యత్తును ముందుగానే అంచనా వేయగల శక్తి ఉంటుంది. మంచి మార్గదర్శకులుగా ఎదగడంలో వీరి పుట్టిన తేదీ వీరికి సహకరిస్తుంది.
ఏ నెలలో అయినా 26వ తేదీలో జన్మించిన వారు ఎలాంటి వ్యాపారంలో అయినా విజయం సాధించగలరు. అలాంటి శక్తి వీరిలో ఉంటుంది. వీరిలో శక్తివంతమైన నైపుణ్య లక్షణాలు కలిగి ఉంటారు. ఎందుకంటే 2+6 = 8. వీరు ఏ పని చేసినా వ్యూహాత్మకంగా, ప్రణాళిక దృష్టితో ప్లాన్ చేసి మరీ విజయం సాధిస్తారు. ఏది పడితే అది చేయరు. ఆలోచించకుండా ఏ పనీ చేయరు. వ్యవస్థాబద్దంగా పని చేస్తారు. ఆలోచనాత్మకంగా తమ మార్గాన్ని తీర్చిదిద్దుకుంటారు. వీరి చుట్టూ ఉన్నవారితో సమన్వయంగా వ్యవహరించగలగటం వారి ప్రత్యేకత. వారు మంచి వ్యాపారవేత్తలుగా, ప్రజా సంబంధ నిపుణులుగా ఎదుగుతారు.
ఫైనల్ గా...
ఈ నాలుగు తేదీల్లో జన్మించినవారికి సహజంగా ఉన్న శక్తులు, నాయకత్వం, వ్యూహాత్మకత ఆలోచనలతో విజయం సాధిస్తారు. అయితే, ఈ లక్షణాలను మన జీవితంలో సమర్థవంతంగా ఉపయోగించాలంటే, అవగాహన, వినయం , ధైర్యం అవసరం. సంఖ్యాశాస్త్రం మనకు మార్గదర్శకత్వం చూపగలదు కానీ దాన్ని జీవితంలో కార్యరూపంలోకి తేవడమే అసలైన విజయం. మీ జన్మతేది కూడా వీటిలో ఒకటి అయితే, మీలో దాగి ఉన్న శక్తిని గుర్తించండి, అభివృద్ధి చెందండి.