ధనుస్సు రాశి వారిపై గురు గ్రహం ప్రభావం ఉంటుంది. దీనివల్ల మార్చిలో గురుడు ప్రత్యక్ష మార్గంలోకి రావడం వల్ల సానుకూల ప్రభావాలు పెరుగుతాయి. ధనూ రాశి వారి కెరీర్, కుటుంబ జీవితంలో పరిస్థితులు అనుకూలంగా మారవచ్చు. ఈ రాశి వారు కోరుకుంటున్న మార్పులు జీవితంలో జరిగే అవకాశం ఉంది. సంతానం కోసం ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న జంటలకు ఆ కోరిక నెరవేరుతుంది. మీరు కష్టపడి పనిచేస్తే భూమి, ఇల్లు, వాహనం వంటివి కూడా కొనుగోలు చేయవచ్చు.