ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు ప్రేమించిన వారిని అస్స‌లు వ‌దల‌రు.. వీరు జీవితంలోకి రావాలంటే రాసి పెట్టుండాలి

Published : Nov 23, 2025, 10:45 AM IST

Numerology: న్యూమ‌రాల‌జీని విశ్వ‌సించే వారు చాలా మంది ఉంటారు. న్యూమ‌రాల‌జీ అనేది ఒక శాస్త్రం. మ‌నం పుట్టిన తేదీ ఆధారంగా మ‌న వ్య‌క్తిత్వం ఎలా ఉంటుందో చెబుతుంటారు. 

PREV
15
సంఖ్యాశాస్త్రం ఏమి చెబుతుంది?

సంఖ్యాశాస్త్రం ప్రకారం ప్రతి సంఖ్య వ్యక్తిత్వం గురించి ప్రత్యేకమైన సంకేతాలను ఇస్తుంది. జన్మించిన తేదీ మన ఆలోచనలు, గుణాలు, భవిష్యత్ దిశను ప్రభావితం చేస్తుందని నమ్మకం. అందులో భాగంగా 8 సంఖ్య ఒక శక్తివంతమైన సంఖ్యగా ప‌రిగ‌ణిస్తారు.

25
ఎవరికీ 8 సంఖ్య వర్తిస్తుంది?

ఏ నెలలో అయినా 8, 17 లేదా 26వ తేదీల్లో పుట్టిన వారిని సంఖ్యాశాస్త్రంలో నెంబర్ 8 వ్యక్తులుగా గుర్తిస్తారు. ఈ సంఖ్యపై శని గ్రహ ప్రభావం ఉంటుందని చెబుతారు. అందువల్ల ఈ సంఖ్య కలిగిన అమ్మాయిలు ధైర్యవంతులు, క్రమశిక్షణ గలవారు, కష్టపడి పనిచేసే స్వభావం కలిగి ఉంటారు.

35
8 సంఖ్య ఉన్న అమ్మాయిల వ్యక్తిత్వం

ఈ సంఖ్య కలిగిన యువతులకు బాధ్యత అంటే ఎంతో విలువ. వారు వ్యవస్థతో, ప్లానింగ్‌తో, స్పష్టమైన లక్ష్యాలతో ముందుకు సాగుతారు. బయటకు గట్టిగా కనిపించినా, లోపల చాలా భావోద్వేగాలు ఉంటాయి. కానీ తమ భావాలను అంత సులభంగా బయటపెట్టరు. వారి మాటల్లో నెగిటివిటీ ఉండదు, కానీ నిజం నిర్భ‌యంగా చెబుతారు. అందుకే కొందరికి ఈ అమ్మాయిలు కఠినంగా కనిపిస్తారు.

45
సంబంధాలలో ఎలా ఉంటారు?

ఈ సంఖ్య ఉన్న అమ్మాయిలు నిజాయితీ, న‌మ్మ‌కానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తారు. నకిలీ వ్యవహారాలు, మోసం, పొగడ్తలు చేసే వ్యక్తులను అస్సలు ఇష్టపడరు. వారు తమ జీవితంలోకి ఎవ్వరినైనా ఆహ్వానించడానికి ముందు చాలాసార్లు ఆలోచిస్తారు. ఒకసారి నమ్మితే.. జీవితాంతం తోడుగా ఉంటారు. వీరు భాగస్వాములుగా దొరకాలంటే రాసి పెట్టుండాలి. 

55
కెరీర్ విష‌యానికొస్తే..

నెంబర్ 8 అమ్మాయిలు ఏం నిర్ణయించినా దానిని పూర్తిచేయడానికి ఎంతో పట్టుదల చూపుతారు. అడ్డంకులు వచ్చినా వెనక్కి తగ్గరు. అందుకే వీరు అడ్మినిస్ట్రేష‌న్‌, చ‌ట్టం, ఫైనాన్స్‌, లీడర్‌షిప్, ఎడ్యుకేషన్ వంటి రంగాల్లో అద్భుతంగా రాణిస్తారు. వీరి కృషి, క్రమశిక్షణ, ధైర్యం వారిని విజయం వైపు న‌డిపిస్తాయి.

గ‌మ‌నిక‌: ఈ విష‌యాల‌ను ఇంట‌ర్నెట్‌లో అందుబాటులో ఉన్న స‌మాచారం ఆధారంగా అందించ‌డ‌మైంది. వీటిలో ఎలాంటి శాస్త్రీయ‌త లేద‌ని రీడ‌ర్స్ గ‌మ‌నించాలి.

Read more Photos on
click me!

Recommended Stories