Travel Vastu tips: ఇంటి నుంచి పని మీద ప్రయాణం మొదలుపెట్టేటప్పుడు కొన్ని ముఖ్యమైన పనులు చేస్తే మంచిది. అనుకున్న పనులు విజయవంతమవుతాయి. ప్రయాణం శుభకరంగా మారుతుందని వాస్తు శాస్త్రం చెబుతోంది.
మనదేశంలో వాస్తుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ అవసరాలు, ఆధ్యాత్మిక యాత్రలు ఇలా ఎన్నో రకాలుగా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. మీ ప్రయాణం సురక్షితంగా, విజయవంతంగా పూర్తవ్వాలని కోరుకుంటారు. భారతీయ సంప్రదాయంలో కొన్ని వాస్తు చిట్కాలను పాటించడం ద్వారా శుభకరమైన ఫలితాలను పొందవచ్చు.
26
ఇంటిని శుభ్రంగా ఉంచడం
వాస్తు శాస్త్రం ప్రకారం ప్రయాణం మొదలుపెట్టే ముందే ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. దీని వల్ల మంచి శక్తులు ఇంట్లోకి ప్రవేశిస్తాయి. ప్రయాణానికి బయలుదేరే ముందు ఇంటిని అస్తవ్యస్తంగా వదిలేస్తే మనసులో ఒకరకమైన గందరగోళం, టెన్షన్ ఏర్పడుతుంది. ఇంటిని సర్దుకుని, శుభ్రంగా ఉంచితే మానసికంగా ప్రశాంతత కలిగి ప్రయాణంలో కూడా ప్రతికూలతలు తగ్గుతాయి.
36
తీపి ఏదో ఒకటి తినడం
ఇంట్లో నుంచి బయలుదేరేటప్పుడు చక్కెర, స్వీట్లు లేదా పెరుగు తినిపించే ఆచారం ఉంటుంది. వాస్తు శాస్త్రంలో ఇది చాలా శుభ సూచకంగా చెబుతారు. తీపి తింటే మనసు ఉల్లాసంగా ఉంటుంది. ప్రయాణం సాఫీగా సాగుతుందని భావిస్తారు. ఇది ఒక మంచి ఆరంభానికి సంకేతం అనే భావనతో ఎంతో మందికి ఉంది.
ప్రయాణం మొదలుపెట్టే ముందు ఇంటి గుమ్మం దాటాలి. ఇంటి గుమ్మం దాటేటప్పుడు కుడి పాదాన్ని ముందుగా బయటపెట్టాలి. కుడి కాలు పెట్టడం శుభం, విజయం, అదృష్టానికి సూచకంగా భావిస్తారు. ఈ ప్రయాణం మంచి ఫలితాలతో పూర్తవుతుందని వాస్తు శాస్త్రం చెబుతుంది.
56
దేవుని ఫోటో
ప్రయాణం చేసే ముందు మీ లగేజీలో దేవుని ఫోటో, చిన్న పుస్తకం, తాయేత్తు లేదా రక్షా సూత్రాన్ని తీసుకోవడం మంచిది. వాస్తు శాస్త్రం కూడా ఇదే సూచిస్తుంది. మనసుకు ధైర్యం ఇవ్వడమే కాదు, ఇది ఒక రకమైన ఆధ్యాత్మిక రక్షణగా భావిస్తారు. ప్రయాణంలో భయం తగ్గి, మానసిక శాంతి ఏర్పడుతుందని నమ్మకం ఉంది.
66
నలుపు రంగు వస్తువులు పెట్టకూడదు
నలుపు రంగు సాధారణంగా మంచిది కాదని చెబుతారు. అందుకే ప్రయాణంలో ఎక్కువగా నలుపు రంగు దుస్తులు, వస్తువులు ఉంచకపోవడం మంచిది. పసుపు, తెలుపు, నీలం, ఆకుపచ్చ వంటి రంగులు సానుకూల శక్తిని తెస్తాయని చెబుతారు. కాబట్టి ఈ రంగు దుస్తులనే మీరు బ్యాగులో సర్దుకోవాలి.