Birth date: కొన్ని తేదీలలో పుట్టిన అమ్మాయిలు ఎంతో మొండిగా అలాగే కాస్త జిడ్డుగా ఉంటారని న్యూమరాలజీ చెబుతోంది. కానీ వీరు అనుకున్న పని సాధించి తీరుతారు. పట్టువదలని విక్రమార్కుల్లాంటి వారు.
మనిషి పుట్టిన తేదీని బట్టి ఆ వ్యక్తి జీవితం ఆధారపడి ఉంటుందని చెబుతారు. ఒక వ్యకి పుట్టిన తేదీలోని అంకెలను కలిపితే వచ్చే మూల సంఖ్య లేదా రాడిక్స్ సంఖ్య. అంటే మీరు 29వ తేదీన పుడితే మీ మూల సంఖ్య రెండు అవుతుంది. అలా మూల సంఖ్య ఒకటి ఉన్న అమ్మాయిల గురించి ఇక్కడ మనం చెప్పుకోబోతున్నాం. వీళ్లు పట్టువదలని విక్రమార్కల్లాంటి వారు. అనుకున్నపని సాధించి తీరుతారు. ఇంతకీ ఏ తేదీలలో జన్మించిన వారికి ఇలాంటి గుణం ఉంటుందో తెలుసుకోండి.
25
ఈ తేదీలలో జన్మించినవారు
ప్రతి నెలా 1, 10, 19, 28 తేదీల్లో పుట్టిన అమ్మాయిల మూల సంఖ్య1 అవుతుంది. సంఖ్యా శాస్త్రంలో ప్రతి మూల సంఖ్యకు ఒక ప్రత్యేక స్వభావం ఉంటుంది. అలాగే 1 మూల సంఖ్య కలిగిన అమ్మాయిలు చాలా ధైర్యంగా ఉంటారు. వీరు ఏ పని చేయాలన్నా ముందుగా వస్తారు. వీరి మాటలో నమ్మకం ఉంటుంది. ఒకసారి ఏదైనా నిర్ణయం తీసుకుంటే దాన్ని మార్చడం చాలా కష్టం. అందుకే వీరిని చాలామంది నాయకులుగా చూస్తారు.
35
కానీ మహా మొండి, జిడ్డు కూడా
ఈ తేదీలలో జన్మించిన అమ్మాయిలు చాలా స్వతంత్రంగా ఉండేందుకు ఇష్టపడతారు. ఏ పని అయినా నేనే చేయాలి అనే స్వభావం ఉంటుంది. ఆ పని అయ్యేవరకు వదిలిపెట్టారు. అందుకే కొన్నిసార్లు వీరు జిడ్డులాంటి స్వభావం కలవారిలా అనిపిస్తారు. అలాగే పని పూర్తయ్యే వరకు మొండిగా కూడా ఉంటారు.అది ఇతరులకు ఇబ్బందిగా ఉన్నప్పటికీ, వీరికి మాత్రం అదే బలం.
ఈ తేదీలలో జన్మించిన అమ్మాయిలలో ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువగా ఉంటుంది. ఏ పరిస్థితినైనా ధైర్యంగా ఎదుర్కోవడం వీరి అలవాటు. స్కూల్, కాలేజ్, ఉద్యోగం… ఎక్కడైనా వీరు మంచి పేరును సంపాదిస్తారు. ఎందుకంటే వీరు అంత సులువుగా భయపడే వ్యక్తులు కాదు. ఇతరుల మాటలు సరైనవని అనిపిస్తే మాత్రమే వింటారు. అది మంచి గుణమే అయినా, కొన్నిసార్లు ఈ కారణంగా వీరు కాస్త మొండిగా అనిపించవచ్చు.
55
నిజాయితీగా ఉంటారు
మూల సంఖ్య 1 ఉన్న అమ్మాయిలు ప్రేమలోనూ, కుటుంబ సంబంధాల్లోనూ చాలా నిజాయితీగా ఉంటారు. ఎవ్వరిని ప్రేమించినా హృదయపూర్వకంగా ప్రేమిస్తారు. కానీ కొన్నిసార్లు చిన్న చిన్న విషయాలనే భూతద్దంలో పెట్టి చూసి పెద్దవిగా భావిస్తారు. అమ్మాయిలు ఉద్యోగాలలో చాలా త్వరగా ఎదుగుతారు. బిజినెస్, మేనేజ్మెంట్, టీచింగ్, పోలీస్, ఆర్మీ, మీడియా, పబ్లిక్ రీలేషన్స్ వంటి వాటిలో వీరు సక్సెస్ అవుతారు.