Zodiac signs:మీరు ఎంత రెచ్చగొట్టినా... ఈ రాశుల అమ్మాయిలకు కోపం కూడా రాదు..!

Published : May 14, 2026, 11:45 AM IST

 Zodiac signs: జోతిష్యశాస్త్రం ప్రకారం కొన్ని తేదీల్లో పుట్టిన అమ్మాయిలు శాంత మూర్తులు. ఎదుటివారు ఎంత రెచ్చగొట్టినా కూడా వీరికి ఇసుమంత కోపం రాదు. పైగా అందరికీ ప్రేమ పంచుతారు. ఆ రాశులేంటో చూద్దాం.. 

PREV
13
1.వృషభ రాశి...

వృషభ రాశికి చెందిన స్త్రీలు వీలైనంత వరకు చాలా ప్రశాంతంగా ఉంటారు. వారికి అంత సులభంగా కోపం రాదు. ఈ రాశివారిపై శుక్రుని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే వీరు చాలా హుందాగా వ్యవహరిస్తారు. ఎంత పెద్ద సమస్య వచ్చినా సౌమ్యంగా పరిష్కరించడానికి ప్రయత్నిస్తారు. ఇతరులు తప్పు చేసినా కూడా వారిపై అరవడం లాంటివి చేయరు. వీలైనంత వరకు ఓపికగా చెప్పడానికి ప్రయత్నిస్తారు.

23
2.కన్య రాశి...

కన్య రాశికి చెందిన స్త్రీలు సహజంగా చాలా తెలివైన వారు. వీరు తొందరగా ఎవరిపైనా కోపం చూపించరు. ఎదుటి వ్యక్తి తమను ఎంత విసిగించినా కూడా ఓపికగా సమాధానం చెబుతారు. చాలా తెలివిగా ఆలోచిస్తారు. ప్రతి ఒక్కరిలోనూ చెడుకంటే మంచే ఎక్కువగా ఆలోచిస్తారు. అందరి కీ ప్రేమను పంచేస్తారు.

33
3.మీన రాశి...

మీనరాశికి చెందిన అమ్మాయిలు కూడా వీలైనంత వరకు చాలా ఓపికగా ఉంటారు. వీరు చాలా సున్నిత మనస్కులు. ఇతరుల బాధను కూడా తమ బాధలాగా ఫీలైపోతారు. అంతేకాదు ఎవరైనా కోపం తెప్పించే ప్రయత్నం చేసినా వీరు విసుక్కోరు. కోపం తెచ్చుకోరు. అందరినీ అర్థం చేసుకుంటారు. వీరికి కోపం సహజంగా రాదు.. పొరపాటున వచ్చినా అది రెండు సెకన్లకు మించి ఉండదు..

Read more Photos on
click me!

Recommended Stories