Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు బంధు మిత్రులతో డబ్బు విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి!

Published : May 14, 2026, 05:00 AM IST

Today Rasi Phalalu: ఈ రాశి ఫలాలు 14.05.2026 గురువారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

PREV
113
నేటి రాశి ఫలాలు

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

213
మేష రాశి ఫలాలు

సంతానం నుంచి శుభవార్తలు అందుతాయి. వృత్తి, ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.

313
వృషభ రాశి ఫలాలు

కుటుంబ వ్యవహారాలలో స్థిరమైన ఆలోచనలు చేసి మీ విలువ పెంచుకుంటారు. బంధుమిత్రులతో వివాదాలు కొలిక్కి వస్తాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో ఆశించిన అభివృద్ధి కలుగుతుంది. దూర ప్రయాణాలు లాభిస్తాయి. వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు.

413
మిథున రాశి ఫలాలు

నిరుద్యోగుల యత్నాలు కలిసిరావు. చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. బంధు మిత్రులతో డబ్బు వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండడం మంచిది. గృహ నిర్మాణ ప్రయత్నాలు మందగిస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి.

513
కర్కాటక రాశి ఫలాలు

చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఇంట్లో కొందరి ప్రవర్తన ఇబ్బంది కలిగిస్తుంది. వృత్తి, ఉద్యోగాలలో నూతన ప్రోత్సహకాలు అందుకుంటారు. స్ధిరాస్తి క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇతరుల నుంచి అవసరానికి డబ్బు సహాయం అందుతుంది.

613
సింహ రాశి ఫలాలు

కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. సోదరులతో స్థిరాస్తి వివాదాలు తొలగుతాయి. బంధు మిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది. విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు వింటారు. వృత్తి, ఉద్యోగాలలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది.

713
కన్య రాశి ఫలాలు

జీవిత భాగస్వామితో మనస్పర్ధలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాలలో కొందరి ప్రవర్తన చికాకు కలిగిస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఇంట్లో చికాకులు పెరుగుతాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక వ్యవహారాలు మరింత ఇబ్బంది కలిగిస్తాయి.

813
తుల రాశి ఫలాలు

వృథా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. స్థిరమైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల నష్టపోతారు. నూతన రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. దూర ప్రయాణాలు చేస్తారు. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. ఉద్యోగాలలో అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.

913
వృశ్చిక రాశి ఫలాలు

ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. సోదరుల సహాయంతో వివాదాల నుంచి బయటపడతారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి. బంధుమిత్రుల రాక సంతోషం కలిగిస్తుంది.

1013
ధనుస్సు రాశి ఫలాలు

కుటుంబ వ్యవహారాలలో సొంత నిర్ణయాలు కలిసిరావు. ఇంటా బయటా కొందరి ప్రవర్తన ఆందోళన కలిగిస్తుంది. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఆలయాలను దర్శిస్తారు. ఉద్యోగాలలో అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి.

1113
మకర రాశి ఫలాలు

ఉద్యోగాలలో ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. స్థిరమైన ఆలోచనలు చేసి లాభపడతారు. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు.

1213
కుంభ రాశి ఫలాలు

చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. ఉద్యోగాలలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభించదు. ముఖ్యమైన పత్రాల విషయంలో జాగ్రత్త వహించాలి. వృత్తి, వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు రావు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. రుణ ప్రయత్నాలు కలిసిరావు.

1313
మీన రాశి ఫలాలు

బంధు మిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది. చిన్ననాటి మిత్రులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది. స్థిరాస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. నూతన వస్త్ర, ఆభరణాలు కొనుగోలు చేస్తారు.

Read more Photos on
click me!

Recommended Stories