ధనుస్సు రాశి వారి జీవితం ఎగుడు దిగుడులతో నిండి ఉంటుంది. పరిస్థితులు ఎంత వ్యతిరేకంగా ఉన్నా వీరు కుంగిపోరు. ఏదో ఒక రోజు గెలుస్తామనే నమ్మకంతో ముందుకు సాగుతారు. ప్రయాణాలు, విద్య, కళ, మీడియా, ఆధ్యాత్మికం, వ్యాపారం వంటి రంగాల్లో వీరికి ప్రతిభ ఉంటుంది. ప్రమాదాన్ని ఎదుర్కొనే ధైర్యమే వీరి అతిపెద్ద బలం. ధనుస్సు రాశి వారు ఎక్కువగా పేదరికం నుండి వచ్చినప్పటికీ, తమ ప్రతిభతో ప్రపంచం మెచ్చే స్థాయికి ఎదుగుతారు. 2026 మే తర్వాత రాహు కేతువుల సంచారం వల్ల వీరికి కొత్త అవకాశాలు వస్తాయి. విదేశీ పరిచయాలు, డిజిటల్ వ్యాపారం, సోషల్ మీడియాలో అభివృద్ధి, ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉంది.