Marriage Remedies: ప్రతి ఒక్కరి జీవితంలో వివాహం ఓ మధురమైన వేడుక. అలాంటి వేడుక కోసం యువత ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారు. అయితే రకరకాల కారణాలతో వివాహ సంబంధాలు చెడిపోతూ ఉంటాయి. అలాంటి వారంతా ఈ పరిహారాలను పాటిస్తే.. దోషాలన్నీ పోయి వివాహం త్వరగా జరుగుతుందట.
పెళ్లి అనేది ప్రతి వ్యక్తి జీవితంలో మధురమైన వేడుక. కొందరికి పెద్దల ఆశీర్వాదం, అనుకూల పరిస్థతులతో పెళ్లి త్వరగా జరుగుతుంది. అయితే మరికొందరికి జాతకాలు కుదరక.. అభిప్రాయాలు కలవక.. ఇంకా రకరకాల కారణాలతో వివాహ సంబంధాలు చెడిపోతూ ఉంటాయి. అలాంటి వారు ఈ పరిస్థితిలో జ్యోతిష్య శాస్త్రం ఆధారంగా కొన్ని శుభ పరిహారాలు, వ్రతాలు, దైవారాధనలు వంటి పరిహారాలను పాటిస్తే పెళ్లికి సంబంధించిన దోషాలన్నీ తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.
26
పెళ్లి ఆలస్యానికి కారణాలు
పెళ్లి ఆలస్యానికి అనేక కారణాలు ఉండవచ్చు. జాతకంలో కుజదోషం, రాహు/కేతువు ప్రభావం, కళత్ర స్థానంలో గురువు లేకపోవడం లేదా శని దోషం వంటివి పెళ్లికి అడ్డంకులు కలిగిస్తాయి. ఇలాంటి దోషాలు తొలగిపోవడానికి కొన్ని పరిహారాలు చాలా శక్తివంతమైనవి. సులభమైన ఆ పరిహారాలు త్వరలో పెళ్లి జరిగేలా చేస్తాయి.
పెళ్లి ఆలస్యానికి అనేక గ్రహ దోషాలు కారణమవుతాయి. ముఖ్యంగా కుజదోషం, రాహు-కేతు ప్రభావం, కళత్ర స్థానంలో గురుగ్రహం లేకపోవడం, లేదా శని దోషం వంటి సమస్యలు పెళ్లి ప్రయత్నాల్లో ఆటంకాలు కలిగిస్తాయి. అయితే ఇలాంటి గ్రహదోషాలను నివారించేందుకు పురాణాల్లో సూచించిన కొన్ని శక్తివంతమైన పరిహారాలు ఉన్నాయి. వీటిని సులభంగా ఇంటి వద్దే ఆచరించవచ్చు. ఈ పరిహారాలను చేస్తే, పెళ్లి యోగం త్వరగా సిద్దిస్తుందట.
36
దైవారాధనతో వివాహ యోగం
పెళ్లి ప్రయత్నాలు విజయవంతం కావాలంటే.. నిత్యపూజ ఒక విశ్వాసనీయ మార్గం. జ్యోతిష్య శాస్త్రం, ఆధ్యాత్మిక పరంపరల ప్రకారం.. మధుర మీనాక్షి అమ్మవారు, తిరుక్కడయూర్ తిరుక్కల్యాణ సుందరేశ్వరుడు, కన్యకా పరమేశ్వరి అమ్మవారు, వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి, అలంగుడి గురు భగవాన్ వంటి దేవతలకు పూజించాలంట. ఇలా ప్రత్యేక వ్రతాలు, అభిషేకాలు, నామస్మరణ, ఆలయ దర్శనం వంటివి చేస్తే, వివాహ ఘడియాలు త్వరగా వస్తాయని పురాణాలు చెబుతున్నాయి. ముఖ్యంగా గురువారం, శుక్రవారం వంటి పవిత్ర రోజుల్లో పూజలు చేస్తే ఫలితం త్వరగా కనిపిస్తుంది.
త్వరగా పెళ్లి కావాలని కోరుకునే వారు ప్రత్యేక వ్రతాలు, పూజలు చేయడం ద్వారా శుభ ఫలితాలు పొందవచ్చు. ఉదాహరణకు సోమవారం నాడు "సోమవార వ్రతం" చేయడం ద్వారా త్వరలోనే సరైన జోడీ దొరుకుతుందట. సోమవారం రోజున శివపార్వతులకు పాలు, చందనం, తెల్ల పుష్పాలతో పూజ చేస్తే శుభప్రదం. మంగళవారాల్లో అమ్మవారికి 9 ఎర్రమట్టి దీపాలు వెలిగించి దీపారాధన చేయడం వల్ల శుభవార్తలు వినే అవకాశముందట. శుక్రవారాల్లో కొబ్బరి, పచ్చ కుంకుమతో కన్యకా పరమేశ్వరి దేవిని పూజించడం చాలా మంచి ఫలితాలు వస్తాయి. అదేవిధంగా, శ్రీరాముడి కల్యాణం చూసినట్లుగా భావిస్తూ ప్రతిరోజూ “శ్రీ రామ జయ రామ జయ జయ రామ” అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం కూడా పెళ్లి సంబంధిత అడ్డంకులు తొలగిపోతాయి.
56
గౌరీ పరమేశ్వరి పూజ
పెళ్లి యోగం త్వరగా రావాలంటే.. ఇంట్లో ప్రతి రోజు ఉదయం, సాయంత్రం అమ్మవారు లేదా పార్వతి దేవి చిత్రపటానికి దీపం వెలిగించాలి. అనంతరం “ఓం గౌరీ పరమేశ్వరి నమః” అని 108 సార్లు జపించాలి. పసుపు, తెల్ల పువ్వులతో దేవికి అభిషేకం చేసి ధ్యానం చేస్తే శుభవార్తలు వినే అవకాశముందట. ఇలా భక్తితో చేయడం వల్ల పెళ్లి తేదీ త్వరగా నిర్ణయమవుతుంది.
66
నమ్మకంతో పరిహారం చేస్తే..
పరిహారం అంటే కేవలం ఒక ప్రక్రియ మాత్రమే కాదు. ఆచరణతో పాటు నమ్మకం అవసరం. ఒక బిడ్డ తల్లిని నమ్మినట్టే.. భగవంతుడిని భక్తి, శ్రద్ధతో ప్రార్థించడం వల్లే పరిహారాలు ఫలిస్తాయి. నిజమైన విశ్వాసంతో చేసిన పూజలు, వ్రతాలు వల్ల మీరు సరైన భాగస్వామ్యం పొందే అవకాశముంది.