Astro Tips: అప్పులు తీర్చలేక తిప్పలు పడుతున్నారా? ఇలా చేస్తే మీ కష్టాలు అన్ని పరార్

Published : Jul 10, 2025, 09:56 AM IST

Astro Tips: మీరు అప్పుల భారంతో ఇబ్బంది పడుతున్నారా? ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ రుణ బాధలు వదలడం లేదా ? అయితే.. ఈ  చిన్న చిన్న పరిహారాలు చేయడం ద్వారా మీరు అప్పుల నుండి బయటపడి ఆర్థిక స్వేచ్ఛను పొందవచ్చంట. ఇంతకీ ఆ పరిహారాలేంటీ? ఓ లూక్కేయండి. 

PREV
17
అప్పుల భారం

ప్రతి ఒక్కరూ జీవితంలో ఏదో ఒక సందర్భంలో అప్పు చేసి ఉంటారు. కొన్ని పరిస్థితుల వల్ల అప్పు చేయాల్సి వస్తుంది. అయితే వాటిని తిరిగి చెల్లించే సమయానికి ఏదోక ఖర్చు, ఆటంకం రావడం వల్ల ఆ అప్పును తీర్చలేకపోతారు. అలా అప్పులు పెరిగిపోతూ తల మీద భారంగా మారిపోతాయి. అటువంటి పరిస్థితి తలెత్తడానికి  వాస్తు దోషం కూడా కారణం కావచ్చు. ఈ దోషానికి పరిహారంగా  కొన్ని ప్రత్యేక వ్రతాలు, పూజలు చేయాలని, వీటి ఫలితంగా ఆర్థిక భారాన్ని తగ్గుతుందని పండితులు చెబుతున్నారు. 

27
కుబేర పూజ

కుబేరుడు ధనానికి అధిపతి. గురువారం లేదా శుక్రవారం కుబేర పూజ చేయాలి. ఈ పూజ సమయంలో నెయ్యి దీపం పెట్టి,  "ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యపతయే ధనం మే దేహి దాపయ స్వాహా" అనే మంత్రాన్ని 108 సార్లు శ్రద్ధగా జపించాలి. ఈ విధంగా వారానికి ఒకసారి పాటిస్తే, అప్పు తగ్గి, డబ్బు కొరత దూరమవుతాయట.  

37
తులసి అర్చన

హిందూ సంప్రదాయంలో తులసి మొక్కను లక్ష్మి దేవి ప్రతీక గా భావిస్తారు. ప్రతి రోజూ తులసి కోట వద్ద 11 నెయ్యి దీపాలను వెలిగించి, తులసికి పూలతో అర్చన చేయాలి. అనంతరం, “ఓం శ్రీ మహా విష్ణవే నమః” మంత్రాన్ని 27 సార్లు శ్రద్ధగా జపించాలి. ఈ విధంగా తులసి దేవిని ఆరాధించటం వల్ల  ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని  శాస్త్రోక్త విశ్వాసం. 

47
విష్ణు నామ పారాయణం

రుణ సమస్యలు మిమ్మల్నీ బాధపెట్టి,  ఒత్తిడికి గురి చేస్తాయి. అటువంటి సమస్యల నుండి విముక్తి పొందేందుకు శనివారం రోజు మీ ఇంట్లోనే ఒక  శక్తివంతమైన పరిహారం చేయవచ్చు. ఉదయం లేదా సాయంత్రం శుభ సమయంలో “ఓం నమో భగవతే వాసుదేవాయ” అనే మంత్రాన్ని జపిస్తూ, కొద్దిగా బియ్యం, పుదీనా ఆకులు,  నెయ్యి కలిపి నిప్పులో వేయాలి. ఈ పరిహారం వల్ల రుణభారం తొలిగిపోతుందట. 

57
దాతృత్వం

రుణభారం నుంచి విముక్తి పొందాలనుకునే వారు తమ సామర్థ్యం మేరకు కనీసం ముగ్గురికి అయిన భోజనం పెట్టాలని పురాణాలు చెబుతున్నాయి. ఆకలితో ఉన్నవారికి ప్రేమతో అన్నదానం చేయడం వల్ల, పాపపుణ్య ఫలితాల సమతుల్యత ఏర్పడుతుందని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. ఈ దాతృత్వం ద్వారా మన జీవితం లోకి ఆర్థిక స్వేచ్ఛ, శాంతి,  ధనసౌభాగ్యం కలుగుతుందని విశ్వాసం.

67
శివ పూజ

రుణభారం నుండి విముక్తి పొందాలనుకునే వారు శివలింగాన్ని పూజించాలి. రోజూ లేదా సోమవారం నాడు  శివలింగంపై నీళ్లు లేదా పాలు పోసి అభిషేకం చేయాలి. ఈ సమయంలో   “ఓం నమః శివాయ” అనే మంత్రాన్ని 11 సార్లు జపించాలి. శివారాధన ద్వారా మనసు ప్రశాంత, ఆర్థిక ఇబ్బందులు నెమ్మదిగా తగ్గుతాయని పురాణాలు చెబుతున్నాయి. 

77
తులసితో లింగ అభిషేకం

రుణ విముక్తి పొందాలనుకునే వారు  సూర్యోదయం సమయంలో శివలింగానికి అభిషేకం చేయాలి. ఇందుకోసం: 11 తులసి ఆకులు, బెల్లం ముక్క, యాలకులను నీటిలో కలిపి శివలింగానికి అభిషేకం చేయాలి. అభిషేక సమయంలో "ఓం నమః శివాయ" మంత్రాన్ని భక్తితో జపించాలి. అనంతరం తులసి ఆకులను ఎండబెట్టి లేదా శుభంగా ఉంచి ఇంట్లో భద్రపరచుకోవాలి. ఇవి నెగటివ్ ఎనర్జీని తొలగించి, ధనప్రవాహం, శాంతి, రుణమోచనానికి దోహదపడతాయనేది విశ్వాసం.

Read more Photos on
click me!

Recommended Stories