Zodiac signs: ఏ రాశివారికి ఏ రోజు బాగా కలిసొస్తుందో తెలుసా?

Published : May 19, 2025, 12:04 PM IST

ప్రతిరోజూ ఒకేలా ఎవరికీ ఉండదు. ఒకరోజు ఆనందంగా గడిస్తే, మరో రోజు కష్టాలన్నీ ఒకేసారి రావచ్చు. ఏ రోజు ఎలా ఉంటుందో ఎవరూ ఊహించలేరు.కానీ,  12 రాశులకు  కలిసొచ్చే రోజు ఒకటి ఉంటుంది.  మరి, ఏ రాశివారికి వారంలో ఏ రోజు బాగా అనుకూలంగా ఉంటుందో తెలుసుకుందాం

PREV
112
మేష రాశికి

మేష రాశివారు ఎప్పుడూ చాలా చురుకుగా ఉంటారు. ఉత్సాహమే వారి శక్తి, స్ఫూర్తి కూడా. ఈ మేష రాశికి మంగళ గ్రహం అనుకూలంగా ఉంటుంది. అందుకే, మేష రాశివారికి మంగళవారం చాలా శుభప్రదం. ఈరోజున ఏ పని మొదలుపెట్టినా మంచే జరిగే అవకాశాలు చాలా ఎక్కువ.

212
వృషభ రాశి..

ఈ రాశి అధిపతి శుక్ర గ్రహం. వృషభ రాశి వారు పుట్టుకతోనే మొండివారు. లక్ష్యాన్ని చేరుకోవడం గురించే ఆలోచిస్తూ ఉంటారు. ఏదైనా చేయాలని నిర్ణయించుకుంటే, అది పూర్తయ్యే వరకు వారికి సంతృప్తి ఉండదు. ఈ రాశి వారికి బుధవారం , శుక్రవారం శుభ దినాలు. ఈ రోజుల్లో వారు చేపట్టిన పనులు విజయవంతమవుతాయి. 

312
మిథున రాశి

ఈ రాశి అధిపతి బుధ గ్రహం. ఈ రాశి వారి గ్రహణ శక్తి , జ్ఞాపకశక్తి చాలా బాగుంటుంది. క్షణాల్లో ఎవరినైనా ఆకర్షించే వ్యక్తిత్వం, సామర్థ్యం వారి సొంతం. వారంలో ఏడు రోజుల్లో బుధవారం వారికి శ్రేయస్సును తెస్తుంది. ఈ రాశి వారి ఎక్కువ పనులు ఈ రోజే పూర్తవుతాయి.

412
కర్కాటక రాశి

ఈ రాశి అధిపతి చంద్రుడు. ఈ రాశి వారు మంచి ఆలోచనలు , ఊహాశక్తికి ప్రసిద్ధి చెందారు. సోమవారం కర్కాటక రాశి వారికి అదృష్ట దినం అని చెప్పవచ్చు. సోమవారం చేసే పనులు వారికి శుభ ఫలితాలను ఇస్తాయి. శుభవార్త కూడా సోమవారమే వింటారు.

512
సింహ రాశి

ఈ రాశి వారి అధిపతి సూర్యుడు. అదృష్ట దినం ఆదివారం. సూర్య గ్రహం అధిపత్యంలో ఉన్న సింహ రాశి వారికి ఆదివారం చాలా ముఖ్యమైన , ప్రభావవంతమైన రోజు. సింహ రాశి వారు తమ ప్రతిభను ప్రపంచానికి చూపించడానికి ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది.

612
కన్య రాశి

ఈ రాశి వారి అధిపతి బుధ గ్రహం. తమ ప్రతిభను ఎక్కడ చూపించాలో వారికి స్పష్టమైన అవగాహన ఉంటుంది. కన్య రాశి వారి పరిపూర్ణత ఇతరులను ఆకట్టుకుంటుంది. ఈ రాశి వారికి బుధవారం శుభవారం. శుభ దినం. 

712
తుల రాశి

తుల రాశి వారి అధిపతి శుక్ర గ్రహం. ఇల్లు , ఆఫీస్ రెండింటినీ చాలా చక్కగా నిర్వహించే చాకచక్యం వారిలో ఉంటుంది. ఇతర రోజులతో పోలిస్తే శుక్రవారం వారికి చాలా ఆనందాన్ని ఇచ్చే వారం అలాగే మంచి అనుభవాలు కలిగే రోజుగా ఉంటుంది.

812
వృశ్చిక రాశి

ఈ రాశి వారి అధిపతి మంగళ గ్రహం. అన్ని రంగాల్లోనూ తమ సత్తా చాటడానికి ఏ ప్రయత్నాన్నైనా జాగ్రత్తగా అనుసరిస్తారు. ఈ రాశి వారికి మంగళవారం కంటే మంచి రోజు మరొకటి ఉండదు. ఈ రోజు వృశ్చిక రాశి వారికి అదృష్ట దినం.

912
ధనస్సు రాశి

ఈ రాశి వారి అధిపతి గురు గ్రహం. అందుకే ఈ రాశి వారికి గురువారం చాలా శుభం. గురువు పాలించే ఈ రాశి వారు మంచి వ్యక్తిత్వానికి, ఉదారతకు సాధారణంగా ప్రసిద్ధి చెందారు. గురువారం చేసే పనులు వారికి విజయాన్ని తెచ్చిపెడతాయి.

1012
మకర రాశి

ఈ రాశి అధిపతి శని. విభిన్నమైన పనులు చేసి అందరిలోనూ ప్రత్యేకంగా కనిపించాలనుకునే గుణం ఈ రాశి వారిది. వారికి శుభ దినం శనివారం. శనివారం చేసే పనులు వారికి విజయాన్ని తెచ్చిపెడతాయి.

1112
కుంభ రాశి

ఈ రాశి వారికి కూడా అధిపతి శని దేవుడు. అన్ని రంగాల్లోనూ పనిచేసే సామర్థ్యం వారిలో ఉంటుంది. ఈ రాశి వారు మార్పులకు చలించరు, వారికి శనివారం శుభాన్ని తెస్తుందనడంలో సందేహం లేదు. 

1212
మీన రాశి

ఈ రాశికి అధిపతి గురు గ్రహం. వారికి మంచి రోజు గురువారం. గురువారం చాలా ఉత్సాహంగా ఉండే ఈ రాశి వారు ఏ పనినైనా పూర్తి చేస్తారు.

Read more Photos on
click me!

Recommended Stories