ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించి ప్రశంసలు అందుకుంటారు. సోదరుల నుంచి స్థిరాస్తి లాభం పొందుతారు. దూర ప్రయాణాల్లో నూతన పరిచయాలు కలుగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో శ్రమకు విశేషమైన గుర్తింపు లభిస్తుంది.