Lemon Remedy: దసరా పండుగనాడు నిమ్మకాయలతో ఈ పని చేయండి చాలు, మీ ఇంట్లో డబ్బుకు లోటు రాదు

Published : Oct 01, 2025, 02:49 PM IST

దసరా వచ్చిందంటే అమ్మ వారిని పూజించేందుకు అంతా సిద్ధమైపోతారు. ఆ రోజు మీరు చేసే కొన్ని పనులు మీ ఇంట్లో ప్రతికూల శక్తిని బయటికి పంపించి లక్ష్మీదేవిని అడుగుపెట్టేలా చేస్తాయి. ఆరోజు చేయాల్సిన నిమ్మకాయ పరిహారాలు (Lemon Remedy) తెలుసుకోండి. 

PREV
14
దసరా పండుగ

చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా మనం దసరా పండుగ నిర్వహించుకుంటాము. ఇది ప్రధానమైన హిందూ పండుగ. ఇంట్లో సానుకూల శక్తి ప్రవహించాలన్నా, శుభాలు కలగాలన్నా.. చిన్న చిన్న పరిహారాలు చేయాల్సివస్తుంది. ముఖ్యంగా దసరా నాడు మీరు చేసే పరిహారాలు ఎన్నో విధాలుగా మీకు మేలు చేస్తాయి. మిమ్మల్ని ఆర్థిక కష్టాల నుంచి బయట పడేలా చేస్తాయి. ముఖ్యంగా దసరా నాడు నిమ్మకాయతో ఏం చేయాలో తెలుసుకోండి.

24
అయిదు నిమ్మకాయలతో

దసరా రోజున దుర్గాదేవిని పూజించాలి. ఆరోజు ఐదు నిమ్మకాయలు, ఐదు మిరపకాయలు తీసుకొని దారంతో దండలా చేయండి ఆ దండను తయారు చేస్తున్నప్పుడు ఎవరూ మిమ్మల్ని చూడకుండా జాగ్రత్త పడండి. ఆ తర్వాత ఆ దండని మీ ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ద్వారానికి కట్టండి. ఇంట్లోకి ప్రతికూల శక్తి ప్రవేశించకుండా ఇది అడ్డుకుంటుంది. ప్రాచీన కాలం నుంచి కూడా ఇది వాడుకులో ఉంది. ఇది ఎంతో ప్రభావంతమైనా ఆచారంగా చెబుతారు. ఇది సంపదను ఆకర్షిస్తుందని నమ్ముతారు.

34
నిమ్మ తొక్కలతో

నిమ్మ తొక్కలు మన ఆర్థిక పరిస్థితిని మార్చేందుకు సహాయపడతాయి. ఆర్థికంగా ఇల్లు బలోపేతం అయ్యేలా చేస్తాయి. ఇంట్లోకి సానుకూల శక్తిని వ్యాపింప చేస్తాయి. ఇందుకోసం ముందుగా మీరు నిమ్మకాయను తీసుకొని శుభ్రంగా కడిగి దాని రసాన్ని తీసి తొక్కను వేరు చేయండి. ఇప్పుడు ఒక పాత్రలో ఆ తొక్కను పెట్టండి. ఆ పాత్ర పై కొన్ని పసుపు, బియ్యం గింజలు చల్లండి. ఆ పాత్రను ఇంట్లోనే గుడి దగ్గర లేదా పూజా స్థలంలో ఉంచండి. ఈ మొత్తం పని రహస్యంగానే చేయాలి. అందరూ చూస్తుండగా చేయకూడదు. ఇప్పుడు దసరా రోజున సాయంత్రం ఈ పాత్రలో మిగిలిన పదార్థాలు అన్నింటిని నదిలో లేదా చెట్టు దగ్గర పోసేయండి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లోకి డబ్బు ప్రవాహం పెరుగుతుంది. ప్రతికూల శక్తి ప్రభావం కూడా తగ్గుతుంది.

44
సంపద కోసం

దసరాకు ఒక రోజు ముందు మీరు రహస్యంగా చేయాల్సిన పరిహారం ఒకటి ఉంది. అది కూడా నిమ్మ తొక్కలతోనే. నిమ్మతొక్కలను ముందు రోజు ఎండలోనే ఆరబెట్టండి. దసరా రోజు రాత్రి ఆ తొక్కలోనే దీపాన్ని వెలిగించి ప్రధాన ద్వారం వద్ద ఉంచండి. ఇంట్లోని ప్రతికూల శక్తులు నాశనం అయిపోతాయి. లక్ష్మీదేవి అక్కడే నివసిస్తుంది. కాబట్టి ఇంట్లోకి ఆనందం, శ్రేయస్సు వస్తుంది. మీ కుటుంబ సభ్యులందరూ ఎంతో ఆనందంగా ఉంటారు.

Read more Photos on
click me!

Recommended Stories