అక్టోబర్ నెలలో ఏ రాశివారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసా?

Published : Oct 01, 2025, 01:54 PM IST

October Horoscope: ఈ మాస ఫలాలు అక్టోబర్ నెలకు సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల మాస ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

PREV
113
మాస ఫలాలు

ఈ మాస ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. ఈ నెల ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

213
మేష రాశి ఫలాలు

మేష రాశివారికి ఈ నెల మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. సమస్యలను ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగుతారు. బంధుమిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది. నూతన పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. విద్యార్దులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. ఆర్థిక వ్యవహరాలు అనుకూలంగా సాగుతాయి. నెల మధ్యలో ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. సన్నిహితులతో, కుటుంబ సభ్యులతో అకారణంగా విభేదాలు కలుగుతాయి. అందరిని గుడ్డిగా నమ్మి మోసపోతారు. 

313
వృషభ రాశి ఫలాలు

వృషభ రాశివారికి ఈ నెల అనుకూల వాతావరణం ఉంటుంది. కోరుకున్నవి జరుగుతాయి. ధనలాభ సూచనలు ఉన్నాయి. విందు వినోదాలలో ఉత్సాహంగా పాల్గొంటారు. సామాజిక సేవా కార్యక్రమాల ప్రారంభానికి శ్రీకారం చుడతారు. వృత్తి, వ్యాపారాలలో ఇతరులపై ఆధిక్యతను సాధిస్తారు. నూతన వ్యాపారాలు ప్రారంభించి లాభాలు పొందుతారు. ఆరోగ్యం సహకరిస్తుంది. విద్యార్థులు పరీక్షలలో ఉత్తీర్ణత సాధిస్తారు. దూర ప్రాంతం నుంచి శుభవార్తలు వింటారు. చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది. కుటుంబ సభ్యులతో దూర ప్రయాణాలు కలిసివస్తాయి. కోర్టు వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి.

413
మిథున రాశి ఫలాలు

మిథున రాశివారికి ఈ నెల మిశ్రమ ఫలితాలు ఉంటాయి. నెల ప్రారంభంలో ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. ఒత్తిడి పెరుగుతుంది. ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. ప్రయాణాలలో ఇబ్బందులు ఉంటాయి. అవసరానికి తగ్గట్టుగా ప్రవర్తించక పోవటం వల్ల అనుకున్న పనులు పూర్తికావు. ఇంటా బయటా సమస్యాత్మక వాతావరణం ఉంటుంది. నెల మధ్యలో ఆర్థికంగా కొంత స్థిరత్వం కలుగుతుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. దీర్ఘకాలిక సమస్యలు తొలగి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. పిల్లల చదువు విషయాలు అనుకూలంగా ఉంటాయి. కోర్టు వ్యవహారాల్లో విజయం పొందుతారు. కొత్త పరిచయాలు ఏర్పడుతాయి. చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది. ధన ధాన్య లాభాలు ఉన్నాయి. 

513
కర్కాటక రాశి ఫలాలు

ఈ రాశి వారికి నెల ప్రారంభంలో చిన్నపాటి సమస్యలు ఉన్నప్పటికీ అధిగమించి ముందుకు సాగుతారు. క్రమక్రమంగా పరిస్థితి అనుకూలిస్తుంది. ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు ఉంటాయి. వృత్తి, ఉద్యోగాలలో ట్రాన్స్ ఫర్ సూచనలు ఉన్నాయి. విద్యా సంబంధిత విషయాలలో అనుకూల ఫలితాలు పొందుతారు. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. బంధు మిత్రుల నుంచి సంతోషకరమైన వార్తలు అందుతాయి. ప్రభుత్వ వ్యవహారాలలో అనుకూల ఫలితాలు పొందుతారు. వృత్తి, వ్యాపారాలలో శత్రువులపై ఆధిక్యతను సాధిస్తారు. ఆర్థిక ఒడిదుడుకుల నుంచి బయటపడతారు. దూరప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. కుటుంబ వాతావరణం సంతోషకరంగా ఉంటుంది.

613
సింహ రాశి ఫలాలు

సింహ రాశివారికి ఈ నెల ప్రారంభంలో బాగుంటుంది. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆర్థిక విషయాలలో లోటుపాట్లను అధిగమిస్తారు. వివాదాలను ధైర్యంగా ఎదుర్కొని విజయం సాధిస్తారు. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు కలిసివస్తాయి. బంధు మిత్రులతో వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. పిల్లల చదువు విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. భూ సంబంధిత క్రయవిక్రయాలలో ధన లాభం కలుగుతుంది. నెల మధ్యలో దూర ప్రయాణాలలో ప్రమాద సూచనలు ఉన్నాయి. సన్నిహితులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో స్వల్ప ఇబ్బందులు ఎదురవుతాయి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ తీసుకోవడం మంచిది. 

713
కన్య రాశి ఫలాలు

ఈ నెల కన్య రాశివారికి చాలా అనుకూలంగా ఉంటుంది. కొత్త పనులు ప్రారంభించి సకాలంలో పూర్తిచేస్తారు. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి. వృత్తి, ఉద్యోగాల్లో ఉన్నత పదవులు పొందుతారు. వ్యాపారాల్లో మార్పులు అనుకూలంగా సాగుతాయి. నూతన పరిచయాల వల్ల కొత్త పనులు ప్రారంభిస్తారు. ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. వివాదాలలో కోర్టు తీర్పులు అనుకూలంగా వస్తాయి. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. నూతన గృహం కొనుగోలు చేస్తారు. నెలాఖరులో బంధుమిత్రులతో విభేదాలు ఉంటాయి. ప్రయాణాల్లో జాగ్రత్త వహించడం మంచిది. 

813
తుల రాశి ఫలాలు

ఈ నెల ఈ రాశివారికి అంతగా అనుకూలించదు. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. స్త్రీ సంబంధ సమస్యల్లో చిక్కుకుంటారు. కుటుంబ వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. వృత్తి, వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. అవసరానికి అతి కష్టం మీద సహాయం లభిస్తుంది. ఉద్యోగాలలో ఊహించని సమస్యలు ఎదురవుతాయి. కుటుంబంలో కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. సోదరులతో స్థిరాస్తి వివాదాలు జరుగుతాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు కొంత మందకొడిగా సాగుతాయి. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఇతరులకు సలహాలు సూచనలు ఇవ్వడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. 

913
వృశ్చిక రాశి ఫలాలు

ఈ నెల వృశ్చిక రాశివారికి ప్రతికూల వాతావరణం ఉంటుంది. ప్రతి చిన్న విషయంలో గందరగోళ పరిస్థితులు ఎదురవుతాయి. ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. జీవిత భాగస్వామితో ఉన్న సమస్యలు క్రమ క్రమంగా తొలగుతాయి. పిల్లల ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ వహించాలి. పనులలో ఆటంకాలు అధిగమిస్తారు. వ్యాపార వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. బంధుమిత్రులతో విభేదాలు కలుగుతాయి. సోదరులతో సఖ్యత లోపిస్తుంది. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. నెలాఖరులో ఆర్థిక విషయాల్లో శుభవార్తలు అందుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. 

1013
ధనుస్సు రాశి ఫలాలు

ఈ రాశివారికి అక్టోబర్ నెలలో అనుకూల ఫలితాలు ఉంటాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పొందుతారు. బంధు మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు. దూరప్రాంత ప్రయాణాలు కలిసివస్తాయి. విద్యార్థులు పరీక్షలలో ఉత్తమ ఫలితాలను పొందుతారు. దూరపు బంధువుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాల అందుతాయి. రాజకీయ సంబంధిత పదవులను పొందుతారు. చేపట్టిన వ్యవహారాలు అన్నీ అనుకూలంగా ఉంటాయి. శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. ఆదాయం బాగుంటుంది.

1113
మకర రాశి ఫలాలు

చాలా కాలంగా పడుతున్న ఇబ్బందులు కొంతమేర తగ్గుతాయి. వృత్తి, వ్యాపారాలలో లాభాలు పొందుతారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ధైర్యంగా కొన్ని కార్యక్రమాలను ప్రారంభించి మంచి ఫలితాలు పొందుతారు. మిత్రులతో సంతోషంగా గడుపుతారు. నూతన వాహనం యోగం ఉంది. విద్యార్థులు మరింత కష్టపడాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి ఆశించిన సహాయం లభిస్తుంది. జీవిత భాగస్వామితో విందు వినోదాల్లో పాల్గొంటారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నూతన వస్తు వస్త్ర లాభాలుంటాయి.

1213
కుంభ రాశి ఫలాలు

కుంభ రాశివారికి ఈ నెలలో ప్రతికూల వాతావరణం ఉంటుంది. వృత్తి, వ్యాపారాలలో నష్టాలు పెరుగుతాయి. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేయలేరు. కొన్ని పనుల వల్ల మానసిక సమస్యలు పెరుగుతాయి. ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోవడం వల్ల నిందలు మోయాల్సి వస్తుంది. ఉద్యోగాల్లో చేయని పనికి విమర్శలు ఎదురవుతాయి. వ్యాపార భాగస్వాములు మోసం చేస్తారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు అర్ధాంతరంగా నిలిచిపోతాయి. ఆర్థికంగా ఒడిదుడుకులు ఎదురవుతాయి. స్థిరాస్తి వివాదాలు పెరుగుతాయి. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. 

1313
మీన రాశి ఫలాలు

మీన రాశివారికి ఈ నెల ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. నూతన వ్యాపారాలు కలిసివస్తాయి. ఆదాయానికి లోటు ఉండదు. కానీ ఖర్చు అదుపు చేయడం కష్టంగా ఉంటుంది. విద్యార్థులు పరీక్షలలో ఉత్తీర్ణత సాధిస్తారు. ఈ నెల మధ్యలో అనారోగ్య సమస్యలు ఉంటాయి. సమయానికి నిద్రాహారాలు ఉండవు. ప్రయాణాల్లో ఇబ్బందులు ఉంటాయి. కంటి సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన మానసికంగా ఇబ్బంది కలిగిస్తుంది. విలాసాలకు డబ్బు ఖర్చు చేస్తారు. ఉద్యోగాలలో ట్రాన్స్ ఫర్ సూచనలు ఉన్నాయి. వృత్తి, వ్యాపారాలలో ప్రతికూలత పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. 

Read more Photos on
click me!

Recommended Stories