Vastu Tips: పడమర దిక్కు ఇల్లు కొనకూడదా? కొంటే ఏమౌతుంది..?

Published : Oct 01, 2025, 02:38 PM IST

Vastu Tips: వాస్తు శాస్త్రం అనేది పూర్తిగా మన దిక్కులపై ఆధారపడిన శాస్త్రం. కొనుక్కునే ఇల్లు మంచి దిక్కులో ఉండాలి అని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ, పడమర దిక్కులో ఇల్లు కొనడానికి ఎక్్కువ మంది ఆసక్తి చూపించరు. నిజంగానే ఆ దిక్కులో ఇల్లు కొనకూడదా? 

PREV
14
Vastu Tips

తూర్పు దిక్కు ఇల్లు కొనడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తారు. కానీ.. పడమర దిక్కు లో ఉంటే.. కొనాలా వద్దా.. అనే గందరగోళం చాలా ఎక్కువ మందిలో ఉంటుంది. ఆ దిక్కులో ఇల్లు కొంటే సమస్యలు ఎక్కువగా వస్తాయని, డబ్బు పోతుందని భయపడతారు. కేవలం తూర్పు, ఉత్తరం దిక్కులో ఉండే ఇల్లు మాత్రమే కొనడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. అసలు.. దీని గురించి వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది? ఈ పడమర దిక్కు ఇల్లు కొంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం....

24
కచ్చితంగా పాటించాల్సిన నియమాలు...

మీరు ఇల్లు కొనడానికి లేదా ఇల్లు అద్దెకు తీసుకోవడానికి వెళ్లినప్పుడు, పడమర వైపు ఉన్న ఇల్లు మంచిది కాదు అనే భావనను మొదట మైండ్ లో నుంచి తీసేయాలి. అవును, మీరు పడమర వైపు ఉన్న ఇంటిని తీసుకుంటే.. కొన్ని నియమాలను పాటించాలి. అప్పుడు శుభ ఫలితాలు అందుకుంటారు. పడమర వైపు ఉన్న ఇంటి ప్రధాన ద్వారం పశ్చిమం లేదా వాయువ్య దిశలో ఉంచాలని వాస్తు శాస్త్రం చెబుతోంది. కానీ నైరుతి ద్వారం ఉన్న ఇంటిని మాత్రం ఎంచుకోకపోవడం మంచిది కాదు.

34
ఎత్తైన చెట్లను నాటవచ్చు

పశ్చిమం సూర్యాస్తమయ దిశ. అందువల్ల, సూర్యాస్తమయ కిరణాలు ఇంట్లోకి ప్రవేశించకూడదని చెబుతారు. ఆ ఇంట్లో నివసించే ప్రజల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపే కొన్ని హానికరమైన కిరణాలు కూడా ఇందులో ఉంటాయి. అందువల్ల, ఆ కిరణాలు ఇంట్లో పడకుండా పెద్ద పెద్ద చెట్లను పెంచుకోవచ్చు.

44
ఇంకా ఏ నియమాలు పాటించాలి?

పశ్చిమ ముఖంగా ఉన్న ఇంట్లో, మీ లివింగ్ రూమ్‌ను వాయువ్య దిశలో నిర్మించడం శుభప్రదం. అది ప్రధాన ద్వారం దగ్గర ఉండాలి.

పశ్చిమ ముఖంగా ఉన్న ఇంట్లో, బెడ్‌రూమ్‌ను నైరుతి దిశలో నిర్మించాలి. ఇది భార్యాభర్తల మధ్య సామరస్యాన్ని, ప్రేమను కాపాడుతుంది.

* అటువంటి ఇంట్లో, వంటగదిని ఆగ్నేయ దిశలో నిర్మించాలి.

* పూజా స్థలం లేదా దేవతను ఉంచే స్థలం ఈశాన్య దిశలో ఉండాలి.

* పశ్చిమ ముఖంగా ఉన్న ఇంట్లో, పెద్ద కిటికీలు పడమర లేదా దక్షిణ దిశలో ఉంచకూడదు. తలుపుల సంఖ్య కూడా సమానంగా ఉండాలి.

Read more Photos on
click me!

Recommended Stories