కూతురికి తండ్రే హీరో. కొన్ని రాశులలో (Zodiac Signs) జన్మించిన పురుషులు తమకు పుట్టిన కూతుళ్లను యువరాణిలా పెంచుతారు. ఆ తండ్రులకు పుట్టిన కూతుళ్లు ఎంతో అదృష్టవంతులు. ఆ రాశులేవో తెలుసుకోండి.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి రాశికి ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వం ఉంటుంది. ఒక్కో రాశి వారి లక్షణాలు కూడా భిన్నంగా ఉంటాయి. కొన్ని రాశులలో పుట్టిన పురుషులకు పుట్టే కూతుళ్లకు మహారాణియోగం దక్కుతుంది. ఏ తండ్రి అయినా తన కుమార్తెను రాణిలా పెంచాలని కోరుకుంటాడు. జ్యోతిషశాస్త్రం చెబుతున్న ప్రకారం కొన్ని రాశుల పురుషులు తమ కుమార్తెలను ఎంతో ప్రేమిస్తారు. భద్రతను అందించి కాపాడుతూ ఉంటారు. కూతుళ్లను రాణిలా చూసుకునే నాలుగు రాశులకు చెందిన పురుషులు ఎవరో తెలుసుకుందాం.
25
కర్కాటక రాశి
కర్కాటక రాశిలో జన్మించిన పురుషులు కూతుళ్లను ఎంతో ప్రేమిస్తారు. ఈ రాశిని చంద్రుడు పాలిస్తాడు. వీరికి కుటుంబంతో ఎంతో భావోద్వేగ సంబంధం ఉంటుంది. ఈ రాశిలో పుట్టిన పురుషులు కూతుళ్లను చాలా ప్రేమిస్తారు. ఆప్యాయతగా చూస్తారు. కూతుళ్ల కోసం ఈ రాశిలో పుట్టిన తండ్రులు సమయం కేటాయించి వారితో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. కూతురి చిన్న విజయాన్ని కూడా ఎంతో సంబరపడాతారు.
35
సింహ రాశి
సింహ రాశిలో పుట్టిన మగవారు మంచి తండ్రులుగా పేరు తెచ్చుకుంటారు. వీరు తమ కూతుళ్లను సంతోషంగా ఉంచాలని కోరుకుంటారు. వారిని రాణిలా చూసుకుంటారు. తమ కూతుళ్లను ఆత్మవిశ్వాసంతో పెంచుతారు. ఈ ప్రపంచంలో అందరికన్నా తమకు కూతుళ్లే ముఖ్యమని భావిస్తారు. తన కూతురు సమాజంలో మంచి పేరు తెచ్చు కోవాలని కోరుకుంటారు.
తులా రాశిలో పుట్టిన పురుషులు చాలా ప్రేమగా ఉంటారు. కుమార్తెలను చాలా మర్యాదగా, గౌరవంగా చూసుకుంటారు. ఈ రాశిలో పుట్టిన తండ్రులు కూతుళ్ల భావాలను అర్థం చేసుకుని వారి కోరికలను వెంటనే తీరుస్తారు. కూతుళ్ల కోసం ఏ త్యాగమైనా చేస్తారు. ఈ తండ్రికి పుట్టిన కూతుళ్లు ఎంతో అదృష్ట వంతులనే చెప్పాలి.
55
మీన రాశి
మీన రాశిలో పుట్టిన తండ్రులు భావోద్వేగపరులు. వీరు తమ కుమార్తెల కోసం ఒక ప్రపంచాన్నే సృష్టిస్తారు. ఆ ప్రపంచంలో తమ కూతురిని రాణిగా ఊహించుకుని మురిసిపోతారు. కూతుళ్ల భావోద్వేగాలను లోతుగా అర్థం చేసుకుని వారికి భావోద్వేగ మద్దతును అందిస్తారు. కూతుళ్ల కలలను నిజం చేయడానికి కష్టపడతారు.