అక్టోబర్ నెల ఇప్పటికే ప్రారంభమైంది. ఈ నెలలో చాలా గ్రహాలు తమ కదలికలను మార్చుకుంటాయి. అదేవిధంగా, కొన్ని గ్రహాలు తమ నక్షత్రాలను మారుస్తాయి. గ్రహాల కదలికలలో మార్పు ప్రత్యక్ష ప్రభావం అన్ని రాశులకు చెందిన వ్యక్తుల జీవితాలపై కనిపిస్తుంది. అక్టోబర్ నెలలో కొన్ని రాశులకు చెందిన వ్యక్తులకు కేతువు దుష్ట గ్రహం మంచిది కాదు. ముఖ్యంగా జాతకంలో కేతువు మంచి స్థితిలో లేనివారు ఈ సమయంలో చాలా ఎక్కువ సమస్యలు ఎదుర్కోవలసి రావచ్చు.
ప్రస్తుతం కేతువు సింహ రాశిలో ప్రయాణిస్తున్నాడు. దీనితో పాటు, శుక్రుడు కూడా సింహ రాశిలో తన ప్రయాణాన్ని చేస్తున్నాడు. దీని కారణంగా, శుక్రుడు, కేతువుల సంయోగం సింహ రాశిలో ఏర్పడింది. కానీ అక్టోబర్ 9న శుక్రుడు కన్య రాశిలో ప్రయాణిస్తాడు. కాబట్టి, శుక్రుడు, కేతువుల సంయోగం అక్టోబర్ లో ముగుస్తుంది. జోతిష్యశాస్త్రం ప్రకారం, కేతు నక్షత్రాల మార్పు కొన్ని రాశులకు శుభ ఫలితాన్ని తెస్తుంది. కానీ, కొన్ని రాశులకు ఇది ఎక్కువ నష్టాన్ని కలిగిస్తుంది. దీపావళికి ముందు శుక్రుడు, కేతువుల కలయిక ముగుస్తుంది. ఈ సమయంలో నాలుగు రాశుల వారికి చాలా సమస్యలు రానున్నాయి. మరి, ఆ రాశులేంటో చూద్దామా...