Garuda Puranam: మనం చేసే పనులే మన జీవితాన్ని నిర్ణయిస్తాయి. దీనినే కర్మ ఫలితం అంటారు. అయితే చేసిన తప్పులకు వెంటనే శిక్ష పడకపోయినా మరణించిన తర్వాత నరకంలో శిక్ష అనుభవించి తీరాలని గరుడపురాణం చెబుతోంది.
హిందూ ధర్మంలో గరుడ పురాణం ఒక ముఖ్యమైన గ్రంథం. ఇందులో విష్ణుమూర్తి మహిమలు, సృష్టి విధానం, వైద్య శాస్త్రం, ధర్మశాస్త్రాలు వివరంగా ఉన్నాయి. ముఖ్యంగా, మనిషి చేసిన పుణ్య–పాపాలను బట్టి మరణానంతరం అనుభవించే నరకయాతనల గురించి ఇందులో వివరంగా చెప్పారు.
25
నమ్మకద్రోహం మహాపాపం
వివాహేతర సంబంధాలు లేదా ఇతరుల నమ్మకాన్ని వమ్ము చేయడం గరుడ పురాణం ప్రకారం పెద్ద పాపంగా పరిగణిస్తారు. ఇలాంటి పాపాన్ని "అగమ్యాగమనం" అంటారు. ఒకరిని నమ్మించి మోసం చేస్తే అది నేరుగా మహాపాపం కిందకు వస్తుంది.
35
నరకంలో పడే శిక్షలు
గరుడ పురాణం ప్రకారం, నమ్మకద్రోహం చేసినవారు "తప్తకుంభ" అనే నరకంలో పడతారు. అక్కడ వారు తీవ్రమైన బాధలను అనుభవించాలి. ఆకలి, దప్పిక, ముసలితనం, మరణభయం వంటి ఆరు రకాల దుఃఖాలను భరించాల్సి వస్తుందని చెప్పారు.
మరణానంతరం మాత్రమే కాదు, తిరిగి పుట్టిన తరువాత కూడా ఈ పాపం ఫలితాలు అనుభవించాల్సి వస్తాయి. ఉదాహరణకు.. వివాహేతర సంబంధాలు పెట్టుకున్న వారు తర్వాతి జన్మలో క్రిమి, పురుగు లేదా హీనమైన జీవరాశులుగా పుడతారని గరుడ పురాణం చెబుతుంది. కొంతమంది అయితే నిత్యం రోగాలతో బాధపడుతుంటారు.
55
పాప పరిహారం ఉందా?
గరుడ పురాణం ప్రకారం, పాపాలు చేసినవారు ప్రాయశ్చిత్తం ద్వారా విముక్తి పొందవచ్చు. నారాయణ బలి వంటి శుద్ధీకరణ కర్మలు చేస్తే కొంత ఉపశమనం లభిస్తుంది. అయితే, నమ్మకద్రోహం చాలా తీవ్రమైన పాపం కాబట్టి దీని నుంచి విముక్తి పొందడం కష్టం.