చాలామంది చిన్న సమస్య రాగానే టెన్షన్ పడతారు. భయపడతారు. ఈ సమస్య నాకే ఎందుకు వచ్చిందని ఆలోచిస్తుంటారు. కానీ కొందరు మాత్రం ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు. జ్యోతిష్యం ప్రకారం కొన్ని రాశువారు చిటికెలో సమస్యను సాల్వ్ చేస్తారట. ఆ రాశులేంటో చూద్దామా..
జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. కొన్నిసార్లు సంతోషాలు ఉంటాయి. మరికొన్నిసార్లు కష్టాలు ఎదురవుతాయి. అన్నింటిని తట్టుకొని నిలబడినప్పుడే జీవితం సాఫీగా సాగిపోతుంది. అయితే చాలామంది చిన్న సమస్య రాగానే చాలా టెన్షన్ పడిపోతుంటారు. పరిష్కారం ఆలోచించకుండా బాధపడుతుంటారు. ఈ సమస్య నాకే ఎందుకు వచ్చిందని ఆందోళన చెందుతుంటారు. కానీ కొందరు మాత్రం ఎలాంటి సమస్య ఎదురైనా చిరునవ్వుతో స్వీకరిస్తారు. ధైర్యంగా సమస్యతో పోరాడుతారు. వారి ధైర్యం, స్థిరత్వమే ఆ సమస్యకు చిటికెలో పరిష్కారం కనిపెడుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అలా సమస్యలను ధైర్యంగా ఎదుర్కొని నిలబడే గుణం కొన్ని రాశుల్లో ఉంది. ఆ రాశులేంటో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
26
మిథున రాశి
మిథున రాశి వారు తెలివిగా, చురుకుగా ఉంటారు. ఏ సమస్య ఎదురైనా ఓటమిని మాత్రం ఒప్పుకోరు. ఆ సమస్యను వివిధ కోణాల్లో ఆలోచించి పరిష్కారం కనుక్కోవడానికి ప్రయత్నిస్తారు. ఏ సమస్యనైనా వీరు ఒక పజిల్ లా చూస్తారు. మంచి కమ్యూనికేషన్ నైపుణ్యం ఉండడం వల్ల ఈజీగా సమస్యను సాల్వ్ చేస్తారు. అవసరమైనతే ఇతరుల సహయం తీసుకుంటారు. వారు అన్వేషించే విధానం కరెక్ట్ గా ఉండటం వల్ల తొందరగా సమస్యను పరిష్కరిస్తారు.
36
సింహ రాశి
సింహ రాశి వారు సూర్యుని శక్తితో నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. ప్రతి సమస్యను సవాలుగా స్వీకరిస్తారు. వారి ధైర్యం, ఆత్మవిశ్వాసం, స్పష్టమైన ఆలోచనలతో కఠిన పరిస్థితుల్లోనూ ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకుంటారు. సమస్యలకు తలవంచడం వీరికి అస్సలు ఇష్టం ఉండదు. లీడర్ షిప్ క్వాలిటీస్ ఎక్కువగా ఉండటం వల్ల ఇతరులను ప్రేరేపించి ఒక జట్టుగా చేస్తారు. పరిష్కారం వైపు ముందుండి నడిపిస్తారు.
వృశ్చిక రాశి వారు లోతైన ఆలోచనా విధానాన్ని కలిగి ఉంటారు. చాలా ఎమోషనల్ గా ఉంటారు. సమస్యలను ఒక సవాలుగా తీసుకుంటారు. 'ప్రతిదానికీ ఒక పరిష్కారం ఉంటుంది' అని బాగా నమ్ముతారు. వారి అంతర్గత శక్తి, ఆత్మవిశ్వాసం చాలా బలమైనవి. వీరిని ఓడించడం అంత సులభం కాదు. సమస్య వచ్చినప్పుడు సరైన సమయంలో సరైన రీతిలో స్పందిస్తారు. కష్ట సమయాల్లో ఈ రాశివారు అసాధారణమైన పట్టుదల చూపిస్తారు.
56
మకర రాశి
మకర రాశి వారు చాలా ప్రాక్టికల్ గా ఉంటారు. స్థిరమైన ఆలోచనా విధానాన్ని కలిగి ఉంటారు. వారి క్రమశిక్షణ, ప్రణాళికే వారి బలం. సమస్యలు వచ్చినప్పుడు తడబడకుండా, కంగారు పడకుండా.. చక్కటి పథకం ప్రకారం ముందుకు వెళ్తారు. సమస్యకు కారణం, పరిష్కారాన్ని విశ్లేషిస్తారు. వీరి నిర్ణయాలు చాలా లోతైనవి. సమస్య పరిష్కారానికి ఎంత టైం పట్టినా ఓపికగా ముందుకు సాగుతారు. వారి క్రమశిక్షణ, కృషి.. సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించడంలో సహాయపడుతుంది.
66
సమస్యను అవకాశంగా..
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ నాలుగు రాశుల వారికి సమస్య పరీక్ష కాదు.. ఒక అవకాశం. సమస్య ఎదురైందని ఇతరులు బాధపడుతుంటే, వీరు నవ్వుతూ పరిష్కారం కనుగొంటారు. జీవితం ఎన్నిసార్లు పరీక్షించినా సరే వీరు తిరిగి నిలబడతారు.