Saturn: వీరికి శని దోషం నుంచి విముక్తి.. ఈ నెలలో ఈ 3 రాశులకు రాజయోగమే

Published : Oct 01, 2025, 11:04 AM IST

న్యాయ దేవత శని దేవుడు (Saturn). శని భగవానుడు వక్రగమనం వల్ల కొన్ని రాశుల వారికి మొన్నటి వరకు ఇబ్బందులు ఎదురయ్యాయి.  2025 అక్టోబర్‌లో శని భగవానుడు తన గమనాన్ని మార్చుకుంటున్నాడు. దీని వల్ల మూడు రాశుల వారికి శని దోషం పోయి సర్వ సుఖాలు దక్కుతాయి

PREV
15
శని వక్రగమనం

నవగ్రహాలలో ముఖ్యమైన గ్రహం శని దేవుడు. ఈ గ్రహం నెమ్మదిగా సంచరిస్తుంది. ఈ గ్రహం ఏ సంచారం చేసినా వ్యక్తులను జీవితాలను ఏదో ఒక విధంగా ప్రభావితం చేస్తూనే ఉంటుంది. 2025 అక్టోబర్‌లో శని వక్ర గమనం నుంచి సరైన గమనంలోకి మారబోతున్నాడు. దీనివల్ల మూడు రాశుల వారికి రాజయోగం ఏర్పడుతుంది. వీరు నగలు, ఇల్లు, భూమి వంటివి కొనే అవకాశం ఉంటుంది. ఏ రాశల వారికి శని వల్ల మేలు జరగబోెతోందో తెలుసుకోండి.

25
ఈ మూడు రాశులు

శని సంచారం చాలా నెమ్మదిగా జరుగుతుంది. ఆ గ్రహం ఒక రాశిలో రెండున్నరేళ్లపాటూ ఉంటాడు. 2025 అక్టోబర్‌లో శని వక్ర గమనాన్ని వదిలి సరైన దిశలో ప్రయాణం చేస్తాడు. దీనివల్ల మకరం, కుంభం, తుల రాశుల వారి దోషాలు తొలగిపోతాయి. వీరికి రాజయోగం మొదలవుతుంది. సకల సంపదలు కలుగుతాయి. 

35
మకర రాశి

మకర రాశికి అక్టోబర్‌లో ఏలినాటి శని పూర్తిగా తొలగిపోతుంది. ఆ సమయంలో వీరు కోల్పోయిన భూమి, ఇల్లు, బంగారం సకల సంపదలన్నీ  తిరిగి లభిస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్ దక్కే అవకాశం ఉంది. కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశాలు కనిపిస్తాయి.

45
కుంభ రాశి

కుంభ రాశికి వారికి అష్టమ శని నుంచి విముక్తి కలుగుతుంది.  2025 అక్టోబర్‌లో వారి అష్టమ శని దశ ముగుస్తుంది. వీరు ఈ సమయంలో నగలు, ఇల్లు, భూమి కొనే అవకాశాలు ఉన్నాయి.  ధనలాభాలు కూడా భారీగానే ఉన్నాయి.  ఉద్యోగంలో ప్రమోషన్ దక్కే అవకాశాలు కూడా ఉన్నాయి. కుటుంబంలో గొడవలు చాలా వరకు తగ్గుతాయి.

55
తులా రాశి

తుల రాశి వారికి అక్టోబర్‌లో శని బాధలు తొలగిపోయి రాజయోగం మొదలవుతుంది. నగలు, ఇల్లు, భూమి, వాహనం ఇలా సౌకర్యాలు లభిస్తాయి. డబ్బు విపరీతంగా సంపాదిస్తారు. ఉద్యోగంలో అడ్డంకులు తొలగిపోతాయి. కుటుంబమంతా సంతోషంగా ఉంటుంది.

Read more Photos on
click me!

Recommended Stories