zodiac signs: ఈ 3 రాశులవారు బంగారం పెట్టుకుంటే వారి జీవితం మారిపోవడం పక్కా!

Published : Jun 14, 2025, 10:51 AM IST

బంగారాన్ని ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి? కొందరు రోజూ పెట్టుకుంటారు. మరికొందరు సందర్భాన్ని బట్టి వేసుకుంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్నిరాశుల వారు బంగారం ధరిస్తే శుభప్రదమట. వారి జీవితం ఊహకందని విధంగా మారిపోతుందట. మరి ఆ రాశులేంటో చూద్దామా.

PREV
14
ఏ రాశులవారికి బంగారం ధరించడం శుభప్రదం?

బంగారాన్ని చాలామంది ఇష్టంగా పెట్టుకుంటారు. ఆడవాళ్ల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బీర్వాలో ఎన్ని నగలున్నా.. వారి మనసు కొత్త నగల కోసం ఆరాటపడుతూనే ఉంటుంది. సందర్భాన్ని బట్టి వారు బంగారం కొనుగోలు చేస్తూనే ఉంటారు. కొన్ని నగలను రోజూ పెట్టుకుంటారు. మరికొన్నింటిని సందర్భానికి తగ్గట్టుగా వేసుకుంటారు. అయితే బంగారం అందాన్ని పెంచడమే కాదు.. అదృష్టాన్ని కూడా మారుస్తుందట. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారు బంగారం వేసుకోవడం వల్ల చాలా మంచి జరుగుతుందట. వారి కష్టాలన్నీతీరిపోతాయట. మరి ఏ రాశులవారు బంగారం వేసుకుంటే వారి జీవితం బంగారంలా మారిపోతుందో ఇక్కడ చూద్దాం.

24
మేష రాశి

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మేష రాశికి అధిపతి కుజుడు. కుజుడుని ధైర్యం, శక్తి, సాహసాలకు కారకుడిగా భావిస్తారు. కాబట్టి మేషరాశి వారు బంగారం పెట్టుకుంటే ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయట. అంతేకాదు బంగారం ధరించడం వల్ల ఈ రాశివారి సంపద రెట్టింపు అవుతుందట. వ్యాపారాల్లో లాభాలు వస్తాయట. వారు పట్టిందల్లా బంగారం అవుతుందట. 

34
సింహ రాశి

సింహ రాశికి అధిపతి సూర్యుడు. ఈ రాశి వారు బంగారం పెట్టుకోవడం వల్ల రాజసం, గౌరవం పెరుగుతాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఈ రాశివారికి బంగారంతో కలిసివస్తుందట. బంగారం పెట్టుకోవడం వల్ల నెగిటివ్ ఎనర్జీ పోయి వారి జీవితంలోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుందట. జీవితం పూర్తిగా మారిపోతుందట. వారి జీవితంలో ఉన్న కష్టాలన్నీ తీరిపోతాయట.

44
కన్య రాశి

కన్య రాశికి అధిపతి బుధుడు. ఈ రాశి వారు బంగారం వేసుకోవడం ద్వారా వారి జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయట. జీవితం సంతోషంతో నిండిపోతుందట. వీరు బంగారం వేసుకోవడం వల్ల ఏకాగ్రత పెరుగుతుందట. ఏ పని మొదలు పెట్టినా విజయం సాధిస్తారట. వ్యాపారంలోనూ కలిసివస్తుందట. 

Read more Photos on
click me!

Recommended Stories