ప్రతి ఒక్కరి ఇంట్లో కచ్చితంగా అద్దం ఉంటుంది. కానీ దానిని ఏ దిక్కున పెట్టాలి అనేది చాలా మందికి తెలియదు.వాస్తు శాస్త్రం ప్రకారం ఇది చాలా ముఖ్యమైన విషయం.అద్దాలు మనల్ని ప్రతిబింబించే వస్తువులు మాత్రమే కాదు. శక్తిని ఆకర్షించే గుణాన్ని కూడా కలిగి ఉంటాయి. అవి ఒక గదిలో ఉన్న శక్తి ప్రవాహాన్ని పెంపొందించడంలో లేదా తగ్గించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. అందుకే వాటిని ఎటువైపు ఉంచాలో నిర్ణయించుకోవడంలో తగిన జాగ్రత్తలు అవసరం.
27
ఉత్తర దిశ..
వాస్తు శాస్త్రం ప్రకారం ఉత్తర దిశ అద్దాలకు అనుకూలమైనది. ఈ దిశలో అద్దాలను ఉంచితే ఇంట్లో సంపద ప్రవాహం మెరుగవుతుందని నమ్మకం ఉంది.
37
తూర్పు వైపు...
అలాగే, తూర్పు వైపు ఉంచిన అద్దాలు ఇంట్లోని వ్యక్తుల మధ్య బంధాలను,ప్రేమను పెంచుతాయి. వీటివల్ల సంబంధాలు బలపడతాయని శాస్త్రం చెబుతోంది.
ఈశాన్య దిశలో అద్దాలు ఉంచటం వల్ల ఆరోగ్యం, మానసిక శాంతి, ఆధ్యాత్మిక అభివృద్ధి సాధ్యమవుతాయని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. ఇది అత్యంత శుభదిశగా చెబుతారు
57
పశ్చిమ దిశ
ఇక పశ్చిమ దిశకు వచ్చితే, అక్కడ అద్దాలను ఉంచడం వల్ల కొత్త ఆలోచనలు, సృజనాత్మకతకు ప్రోత్సాహం లభిస్తుందని చెబుతారు. ఇది వ్యక్తిగత అభివృద్ధికి తోడ్పడుతుంది.
67
దక్షిణ, ఆగ్నేయ దిశల్లో
దక్షిణ, ఆగ్నేయ దిశల్లో అద్దాలను పెట్టవద్దు. ఎందుకంటే ఈ రెండు దిశలలో అద్దాలు ప్రతికూల శక్తిని ప్రతిబింబించే ప్రమాదం ఉంది. ఫలితంగా కుటుంబ కలహాలు, ఆర్థిక సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయని చెబుతారు.
77
శాంతి, ఆనందం, అభివృద్ధి
సరైన దిశలో అద్దాలను ఉంచటం ద్వారా ఇంట్లో శాంతి, ఆనందం, అభివృద్ధి మెరుగవుతాయి. వాస్తు సూత్రాలను పాటించడం ద్వారా శక్తిని సానుకూలంగా మలచుకోవచ్చు. మీ ఇంటిని శ్రేయస్సు, శాంతి దిశగా మార్చాలనుకుంటే అద్దాల దిశ విషయంలో తప్పకుండా శ్రద్ధ వహించాలి.