మిథున రాశివారికి గురు-చంద్ర యోగం కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. నూతన ఆలోచనలతో ముందుకు సాగుతారు. సృజనాత్మకత, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వ్యాపారం లేదా కళా రంగంలో ఉన్నవారికి విజయాలు దక్కుతాయి. స్నేహితుల సహకారం, కొత్త పరిచయాలు అదృష్టాన్ని తెస్తాయి. కుటుంబంలోకి కొత్త సభ్యులు వచ్చే అవకాశం ఉంది. ధ్యానం, పూజలకు ఈ సమయం చాలా అనుకూలం.