నేడు మిథున రాశి వారికి వీటిలో విజయం దక్కుతుంది!

Published : Sep 10, 2025, 06:30 AM IST

10.09.2025 బుధవారానికి సంబంధించిన మిథున రాశి ఫలాలు ఇవి. నేడు మిథున రాశివారికి ఆరోగ్యం, వ్యాపారం, ఉద్యోగాల్లో ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

PREV
15
మిథున రాశి ఫలాలు (మృగశిర 3,4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు)

నేడు మిథున రాశి వారి జాతకం ఎలా ఉండనుంది? ఈ రాశివారికి కలిగే లాభాలు, నష్టాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్న వివరాలు ఇలా ఉన్నాయి. ఓసారి తెలుసుకుందామా...

25
ఆరోగ్యం

నేడు మిథున రాశివారి ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. మానసిక ప్రశాంతత వల్ల శారీరక ఆరోగ్యంపై కూడా పాజిటివ్ ప్రభావం పడుతుంది. అయితే, గాలి మార్పుల వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి చిన్న చిన్న సమస్యలను కూడా నిర్లక్ష్యం చేయకపోవడం మంచిది.  

35
ఆర్థిక పరిస్థితి

ఆర్థికంగా పురోగతి ఉంటుంది. నిలిచిపోయిన డబ్బు తిరిగి వస్తుంది. కొత్త ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి. పెట్టుబడులకు అనుకూలమైన సమయం. కాబట్టి భవిష్యత్తుకు మేలు చేసే ఆర్థిక నిర్ణయాలు తీసుకోవచ్చు. అయితే ఖర్చులను సమర్థవంతంగా నియంత్రించడమే దీర్ఘకాలిక లాభాలకు దోహదం చేస్తుంది.

45
ఉద్యోగం

ఉద్యోగులకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. పై అధికారుల నుంచి ప్రశంసలు దక్కుతాయి. ప్రమోషన్లు కూడా రావొచ్చు. వృత్తి జీవితంలో కొత్త అవకాశాలు వస్తాయి. కెరీర్‌ అభివృద్ధికి ఇది మంచి దశ. ముఖ్యంగా నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఇంటర్వ్యూలు, పరీక్షలలో విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

55
వ్యాపారం

వ్యాపారాల్లో ప్రారంభించిన పనులు సజావుగా సాగడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. గతంలో ఎదురైన అంతరాయాలు తొలగిపోతాయి. కస్టమర్ల నుంచి మంచి స్పందన రావడం, కొత్త కాంట్రాక్టులు రావడం వంటి అంశాలు ఉత్సాహాన్ని కలిగిస్తాయి. భాగస్వామ్యాల్లో స్పష్టత, పరస్పర నమ్మకం వల్ల వ్యాపారాల్లో లాభాలు చూస్తారు.

Read more Photos on
click me!

Recommended Stories