Vastu for Wealth: సాయంత్రం దాటాక ఎవరికి ఈ ఐదు వస్తువులను ఇవ్వకండి, మీ ఇంట్లోని సంపద కరిగిపోతుంది

Published : Sep 01, 2025, 02:16 PM IST

వాస్తు జ్యోతిష శాస్త్రంలో సాయంత్రం సమయం ఎంతో ముఖ్యమైనది. ముఖ్యంగా ఆ సమయంలో చేసే పనులు ఇంట్లోని సంపదపై నేరుగా ప్రభావాన్ని చూపిస్తాయి. అందుకే సాయంత్రం పూట కొన్ని పనులు చేయకూడదు. అలాగే కొన్ని వస్తువులను కూడా వేరే వారికి దానం ఇవ్వకూడదు. 

PREV
15
పాలు

సాయంత్రం 5 దాటిన తర్వాత ఎవరు అడిగినా కూడా పాలను దానం చేయడం లేదా ఇవ్వడం వంటివి చేయకండి. ఎందుకంటే పాలకు చంద్రునితో అనుబంధం ఉంది. పాలను చంద్రునికీ చిహ్నంగా చెప్పుకుంటారు. అలాగే ఇది శాంతి, శ్రేయస్సుకు కారణం సాయంత్రం తర్వాత ఎవరికైనా పాలను అప్పుగా ఇవ్వడం లేదా దానం చేయడం వంటివి ఇంట్లోని సానుకూల శక్తిని తగ్గించేస్తాయి. దీనివల్ల ఆర్థిక సంక్షోభావాలు రావచ్చు. మీకు పాలు అంతగా దానం చేయాల్సి వస్తే ఉదయం మాత్రమే చేయండి. లేకుంటే ఇంట్లోనే సంపద కరిగిపోయే అవకాశం ఉంది.

25
పెరుగు

ప్రతి ఇంట్లోని పెరిగి ఉండడం సహజం సాయంత్రం పూట ఎవరైనా వచ్చి కాస్త పెరుగు ఇవ్వండి. అంటే పక్కింటి వారికి, ఎదురింటి వారికి ఎంతో మంది ఇచ్చేస్తూ ఉంటారు. కానీ జ్యోతిష్యం ప్రకారం పెరుగును సాయంత్రం ఐదు తర్వాత ఎవరికీ దానం చేయకూడదు. ఇది శుక్ర గ్రహంతో అనుబంధాన్ని పెట్టుకుంటుంది. సాయంత్రం తర్వాత కాలంలో పెరుగు ఇవ్వడం వల్ల డబ్బు నష్టం ఇంట్లో జరిగే అవకాశం ఉంటుంది. అలాగే కుటుంబంలో ఆనందం కూడా తగ్గిపోవచ్చు. మీకు పెరుగు దానం చేయాలనిపిస్తే ఉదయం లేదా మధ్యాహ్నం మాత్రమే చేయండి. సాయంత్రం పూట ఎవరికి ఇవ్వకండి.

35
ఉప్పు

ఇంట్లోని ఎవరైనా ఎవరి ఇంట్లోనైనా ఉప్పు హఠాత్తుగా అయిపోతే పక్కింటి వారిని అడగడం సహజం. అలా మీ పక్కింటి వారు అడగ్గానే ఉప్పుని ఇచ్చేయకండి. సాయంత్రం తర్వాత ఉప్పు ఇవ్వడం లేదా దానం చేయడం అనేది ఇంట్లోకి ప్రతికూల శక్తిని ఆహ్వానించడమే. ఉప్పుకు శని, రాహు గ్రహాలతో అనుబంధం ఉంటుంది. ఉప్పుని ఎప్పుడైతే మీరు సాయంత్రం ఐదు తర్వాత ఎవరికైనా ఇస్తారో అప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఇంట్లో మొదలవ్వచ్చు. కాబట్టి పగటిపూట మాత్రమే ఉప్పును ఎవరికైనా దానంగా ఇవ్వండి.

45
పంచదార

పంచదారకు శుక్ర గ్రహానికి అనుబంధం ఉంది. శుక్ర గ్రహం వల్ల ఇంట్లో ఆనందం, శ్రేయస్సు కలుగుతుంది. అలాగే చక్కెర ఇంట్లో ఉండడం వల్ల కూడా ఆనందం ఉంటుంది. సాయంత్రం తర్వాత చక్కెరను ఎవరికైనా ఇవ్వడం వల్ల డబ్బు నష్టం జరగవచ్చు. లేదా వైవాహిక జీవితంలో గొడవలు రావచ్చు. చక్కెర దానం చేయడం సూర్యాస్తమయానికి ముందు మాత్రమే జరగాలి. సూర్యాస్తమయం తర్వాత ఎవరికీ పంచదారను దానంగా గాని ఉచితంగా గాని ఇవ్వకండి.

55
పసుపు

బృహస్పతి గ్రహానికి పసుపుకు అనుబంధం ఉంది. సరస్వతి జాతకంలో బలంగా ఉంటే ఆ వ్యక్తి ఆరోగ్యంగా, సుఖంగా జీవిస్తాడు. కాబట్టి సాయంత్రం తర్వాత పసుపును ఎవరికైనా దానం చేయడం వంటి పనులు చేయకండి. ఇది ఇంట్లోని సంపద, ఇంట్లోని వారి ఆరోగ్యం పై చెడు ప్రభావాన్ని చూపిస్తుంది. నిజానికి పసుపును ఎవరికీ ఉచితంగా ఇవ్వడం అంత మంచి పద్ధతి కాదు. కాబట్టి పైన చెప్పిన ఐదు వస్తువులను సాయంత్రం తర్వాత ఎవరికీ ఇవ్వకండి.

Read more Photos on
click me!

Recommended Stories