ఈ నాలుగు రాశుల వారికి సెప్టెంబర్ నెలలో విపరీతంగా కలిసి వస్తుంది , అదృష్టం అంటే వీరిదే

Published : Sep 01, 2025, 12:28 PM IST

సెప్టెంబర్ నెల మొదలైపోయింది. గ్రహ సంచారాల కారణంగా కొన్ని రాశుల వరకు ఈ నెలలో అదృష్టం పట్టే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా డబ్బు అధికంగా సంపాదించవచ్చు.. లేదా విజయం అందుకోవచ్చు. ఎలాగైనా సెప్టెంబర్ లో అదృష్టరాశులు వీరే. 

PREV
15
సెప్టెంబరు నెలలో అదృష్ట రాశులు

2025 సెప్టెంబర్ నెల మొదలైపోయింది. సెప్టెంబర్ నెలలో కుజుడు, బుధుడు, శుక్రుడు, సూర్యుడు నక్షత్ర స్థితిగతులను మార్చుకుంటున్నారు. ఇవే కాకుండా అనేక గ్రహాలు సంచారం వల్ల ఎన్నో మార్పులు కలుగుతాయి. ఈ మార్పులన్నీ కూడా రాశి చక్రంలోని 12 రాశులపై ప్రభావాన్ని చూపిస్తాయి. అయితే కొన్ని రాశుల వారికి మాత్రం సెప్టెంబర్ నెలలో అన్నీ అనుకూలంగా జరుగుతాయి. వారు పట్టిందల్లా బంగారమే అని చెప్పుకోవచ్చు. ఆ నాలుగు రాశులు ఏవో తెలుసుకోండి.

25
వృషభ రాశి

వృషభ రాశికి అతిథులు అధిపతి శుక్రుడు శుక్రుడు సెప్టెంబర్లో తన గ్రహస్థితులను మార్చుకుంటాడు. కాబట్టి వృషభ రాశి వారికి సెప్టెంబర్ నెల కలిసి వస్తుంది. వివాహంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. డబ్బు సంపాదన కూడా పెరుగుతుంది. ఆదాయ వనరులు కూడా ఎక్కువ అవుతాయి. అలాగే మంచి జీవన శైలిని కొనసాగిస్తారు. ప్రతిరోజు దేవుడు ముందు దేశీ నెయ్యితో దీపం వెలిగించండి. మీకు అంతా మేలే జరుగుతుంది.

35
మిధున రాశి

మిధున రాశి వారికి సెప్టెంబర్ నెల కలిసి వచ్చే నెల. వీరికి కొత్త బాధ్యతలు అందుతాయి. అంతేకాదు వారు వాటిని చక్కగా నెరవేరుస్తారు. మీరు సానుకూలంగా జీవితాన్ని సాగిస్తారు. పూర్తి సామర్థ్యంతో పని పూర్తి చేస్తారు. సంబంధాలు మెరుగవుతాయి. ఆర్థికంగా కూడా బలం పెంచుకుంటారు. గణేశుడు మంత్రాలను జపించడం వల్ల ఉపయోగం ఉంది.

45
కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి చంద్రుడు అధిపతి. సెప్టెంబర్లో చంద్రగ్రహణం కూడా ఉంది. అందుకే ఈ రాశి వారికి ఈనెల అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. వీరి వ్యక్తిత్వం అద్భుతంగా మారుతుంది. కొత్త వ్యాపారాన్ని మొదలు పెడతారు.. లేదా ఏదైనా కొత్త పనిని మొదలుపెట్టి విజయాన్ని సాధిస్తారు. వారానికి ఒకసారి అయినా గుడికి వెళ్లడం అలవాటు చేసుకోండి. ఇది మీ జీవితంలో మరింత సానుకూలతను తెచ్చిపెడుతుంది.

55
కుంభ రాశి

కుంభ రాశి వారికి అధిపతి శనీశ్వరుడు. సెప్టెంబర్ నెలలో వీరికి కూడా అన్ని రకాలుగా కలిసివస్తుంది. సెప్టెంబర్ నెలలో వీరు కొత్త ప్రారంభాన్ని చూస్తారు. పని ఏదైనా పూర్తిగా చేస్తారు. వీరి ఆదాయం కూడా పెరుగుతుంది. వ్యాపారవేత్తలకు ఇది కలిసి వచ్చే సమయం. ఆర్థిక లాభాలు అందాలంటే ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజించండి. లక్ష్మీదేవికి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించి ఆ ప్రసాదాన్ని అందరికీ పంచండి.

Read more Photos on
click me!

Recommended Stories