Astrology: వ‌చ్చే 15 రోజులు ఈ రాశుల వారికి ప‌ట్టింద‌ల్లా బంగార‌మే.. అరుదైన యోగం

Published : Sep 01, 2025, 11:36 AM IST

ఆగస్టు 30న బుధుడు సింహరాశిలో ప్రవేశించడంతో రవి, కేతువులతో కలిసి మూడు గ్రహాల కలయిక ఏర్ప‌డింది. దీంతో బుధాదిత్య యోగం, వృద్ధి యోగం ఏర్ప‌డ్డాయి. ఇవి సెప్టెంబర్ 15 వరకు కొన‌సాగ‌నున్నాయి. ఈ కాలంలో ఆరు రాశుల వారికి ఊహించని మార్పులు జరగనున్నాయి.  

PREV
16
వృషభం – ఆస్తి లాభాల సూచనలు

వృషభరాశివారికి నాలుగవ స్థానంలో ఈ యోగం ఏర్పడటంతో గృహ, భూ, ఆస్తి సంబంధిత లాభాలు కలుగుతాయి. ఇంతకాలం సాగిన ఆస్తి వివాదాలు, కోర్టు సమస్యలు పరిష్కారమవుతాయి. ఉద్యోగంలో హోదా పెరిగి జీతం, అదనపు రాబడి పొందే అవకాశం ఉంది. వ్యాపారంలో నష్టాలు తగ్గి లాభాలు పెరుగుతాయి. నిలిచిపోయిన బాకీలు సైతం చేతికి వస్తాయి.

26
కర్కాటకం – ఆదాయ వృద్ధి, ఆర్థిక సౌలభ్యం

కర్కాటక రాశివారికి ధనభావంలో మూడు గ్రహాల కలయిక శుభ ఫలితాలను ఇస్తుంది. పెట్టుబడులు, షేర్లు, స్పెక్యులేషన్ ద్వారా లాభాల వర్షం కురుస్తుంది. కుటుంబ ఆదాయం పెరుగుతుంది. ఆస్తుల విలువ పెరగడంతో పాటు కొత్త ఆర్థిక అవకాశాలు ఎదురవుతాయి. వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు పూర్తిగా పరిష్కారం అవుతాయి.

36
సింహం – పదోన్నతి, ఆకస్మిక ధన లాభం

సింహ రాశి వారికి రాశ్యధిపతి రవితో కలిసి బుధుడు, కేతువులు యుతి కావడంతో అద్భుత ఫలితాలు కలుగుతాయి. ఉద్యోగంలో పదోన్నతి, జీత భత్యాల పెరుగుదల ఉంటుంది. ధన లోటు లేకుండా ఆర్థిక స్థితి బలపడుతుంది. ఆకస్మికంగా డబ్బు రావడం, లాభదాయకమైన పరిచయాలు ఏర్ప‌డుతాయి. కొత్త ఒప్పందాలు, వ్యాపార అవకాశాలు ల‌భిస్తాయి.

46
తుల – అనూహ్యమైన లాభాలు

తుల రాశివారికి లాభస్థానంలో ఈ మూడు గ్రహాల యోగం కలవడంతో అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. పెట్టుబడులు, ఆర్థిక లావాదేవీల వల్ల మంచి లాభాలు వస్తాయి. రావలసిన సొమ్ము, ఊహించని డబ్బు కూడా అందుతుంది. ఆస్తి సంబంధిత పనులు అనుకూలంగా సాగుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాల్లో ఆదాయం గణనీయంగా పెరుగుతుంది.

56
ధనుస్సు రాశి వారికి విదేశీ ఆస్తులు

ఈ రాశివారికి భాగ్యస్థానంలో యోగం ఏర్పడటంతో అదృష్టం క‌లిసొస్తుంది. విదేశీ సంపద లభిస్తుంది. తండ్రి ఆస్తి నుండి లాభాలు వస్తాయి. కోర్టు వివాదాలు సులభంగా పరిష్కారమవుతాయి. కొత్త ఇల్లు పొందే అవకాశం ఉంది. అదనపు ఆదాయం కోసం చేసే ప్రతీ ప్రయత్నం విజయవంతమవుతుంది.

66
కుంభ రాశి వారికి జీతంలో పెరుగుదల

సప్తమస్థానంలో మూడు గ్రహాల యోగం ఏర్పడటంతో ఉద్యోగంలో పదోన్నతి, జీతం పెరుగుదల లభిస్తుంది. వ్యాపారం, వృత్తిలో కొత్త అవకాశాలు వస్తాయి. ఆస్తుల విలువ పెరుగుతుంది. సంపన్న కుటుంబం నుంచి వివాహ సంబంధం కలగవచ్చు. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు దక్కే అవకాశం ఉంది.

Read more Photos on
click me!

Recommended Stories