
ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
దూర ప్రయాణాల్లో వాహన ప్రమాద సూచనలు ఉన్నాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా పడతాయి. బంధువులతో అకారణంగా విభేదాలు కలుగుతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపార, ఉద్యోగాల్లో పని ఒత్తిడి తప్పదు.
ఆదాయం మరింత పెరుగుతుంది. రాజకీయ వర్గాల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు లాభాల బాట పడతాయి. చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. ఉద్యోగాల్లో పదోన్నతులు పెరుగుతాయి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. నూతన వాహన యోగం ఉంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అధికారులతో చర్చలు ఫలిస్తాయి. వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో అవరోధాలను అధిగమిస్తారు.
ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. బంధు, మిత్రులతో విభేదాలు కలుగుతాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. పనుల్లో ఆటంకాలు కలుగుతాయి. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాల్లో పని ఒత్తిడి పెరుగుతుంది.
బంధువులతో మాటపట్టింపులు కలుగుతాయి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి. దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి. ఉద్యోగాల్లో అదనపు బాధ్యత వల్ల విశ్రాంతి లేకుండా చేస్తాయి.
విద్యార్థులకు పరీక్ష ఫలితాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. మొండి బాకీలు వసూలవుతాయి. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. సన్నిహితుల నుంచి కొత్త విషయాలు తెలుసుకుంటారు. వ్యాపారాల్లో అధిక లాభాలు పొందుతారు. ఉద్యోగాల్లో సమస్యలు తీరి ఊరట చెందుతారు.
కుటుంబ సమస్యలు మరింత చికాకు తెప్పిస్తాయి. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నాయి. మిత్రులతో విభేదాలు కలుగుతాయి. కొత్త అప్పులు చేస్తారు. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాల్లో పనిభారం తప్పదు.
ఇంటా బయట మీ విలువ పెరుగుతుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది.
కుటుంబ వ్యవహారాల్లో ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ప్రయాణాలు వాయిదా వేస్తారు. బంధువులతో మాట పట్టింపులు ఉంటాయి. ముఖ్యమైన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. వ్యాపారాల్లో ఊహించని సమస్యలు వస్తాయి.
ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాల్లో లాభాలు అందుతాయి. పనులు సజావుగా సాగుతాయి. ఆప్తుల నుంచి ముఖ్యమైన విషయాలు తెలుస్తాయి. ఉద్యోగుల కలలు సాకారం అవుతాయి.
ప్రముఖులతో పరిచయాలు లాభిస్తాయి. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. బంధువులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి.
మిత్రులతో అకారణంగా విభేదాలు కలుగుతాయి. వ్యాపారాల్లో కష్టానికి తగ్గ ఫలితం ఉండదు. సోదరులతో ఆస్తి వివాదాలు కలుగుతాయి. పని ఒత్తిడి అధికమవుతుంది. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాల్లో సమస్యలు చికాకు తెప్పిస్తాయి.