న్యూమరాలజీ మన జీవితాలను చాలా ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా మనం పుట్టిన తేదీ ఆధారంగా మన భవిష్యత్తు మాత్రమే కాదు.. వ్యక్తి స్వభావం, గుణం, ఇష్టాయిష్టాలు, అలవాట్లు వంటివి కూడా తెలుసుకోవచ్చు. కాగా, కొన్ని ప్రత్యేక తేదీల్లో జన్మించిన వారు పిసినారి సంఘానికి అధ్యక్షులు అవుతారట. మరి, ఆ తేదీలేంటో చూద్దామా…
25
రూపాయి కూడా ఖర్చు చేయరు..
కొన్ని ప్రత్యేక తేదీల్లో జన్మించిన వారు డబ్బు విషయంలో చాలా కరెక్ట్ గా ఉంటారు. రూపాయి ఖర్చు పెట్టాలన్నా వంద సార్లు ఆలోచిస్తారు. తమ కోసం తాము ఎదైనా కొనుక్కోవాలన్నా వారికి మనసు రాదు. ఇక వేరే వాళ్ల కోసం అయితే… ప్రాణం పోయినా కూడా రూపాయి ఖర్చు పెట్టరు. మరీ తప్పదు అంటే తప్ప.. జేబులో నుంచి రూపాయి బయటకు తీయరు.
వీరు ఖర్చు పెట్టే ప్రతి రూపాయికీ లెక్క వేసుకుంటారు. ప్లాన్ ప్రకారం మాత్రమే ఖర్చు చేస్తారు. సంపాదించిన ప్రతి రూపాయిని చాలా జాగ్రత్తగా దాచుకుంటారు. అయితే.. వీరి మనసు మాత్రం చాలా మంచిది. డబ్బు సహాయం తప్ప.. వేరే ఏ సహాయం అయినా ఇతరులకు చేయడానికి ముందుకు వస్తారు.
సంపాదించిన డబ్బు ఎంత ఎక్కువ దాచి పెట్టాం అనేదే వీరి జీవిత ఆశయం గా జీవిస్తూ ఉంటారు. పిసినారి అంటూ ఇతరులు ఏడిపించినా వీరు పెద్దగా పట్టించుకోరు
35
వారు పుట్టిన తేదీ ఎప్పుడంటే...
జ్యోతిష్యం, numerology ప్రకారం 4, 8, 13, 17, 22, 26, 31 తేదీల్లో పుట్టినవాళ్ళు పిసినారులు. జీవితంలో ఏదైనా ఖర్చు పెట్టాలంటే ప్లాన్ చేసుకుంటారు. అనవసర ఖర్చు అంటే వీళ్ళకి నచ్చదు. ఇతరులు ఖర్చు పెడితే కొందరికి అసూయ కూడా కలుగుతుంది. ముఖ్యంగా శని ప్రభావం ఉన్న 8, 17, 26 తేదీల్లో పుట్టినవాళ్ళు డబ్బు విషయంలో చాలా కంట్రోల్ గా ఉంటారు.
ఈ తేదీల్లో పుట్టినవాళ్ళు Earth Element లేదా Saturn Influence కలిగి ఉంటారు. వీళ్ళ జీవితంలో ఏదీ సులువుగా రాదు. ప్రతిదానికీ కష్టపడాలి. అందుకే వీళ్ళు ఎక్కువగా భద్రతా భావంతో ఉంటారు. జాగ్రత్తగా ఉండటంలో తప్పు లేదు. కానీ.. వీళ్లు అతి జాగ్రత్తతో ఉంటారు. 'ఈ రోజు ఉంది, రేపు ఉండదేమో' అనే భయం వీళ్ళలో ఉంటుంది. అందుకే.. వీరి ప్రతి ఆలోచనా రేపటి కోసం మాత్రమే ఉంటుంది. ఈ రోజు కష్టపడినా.. రేపు ఇబ్బంది పడకూడదు అనే భావన వీరిలో ఎక్కువగా ఉంటుంది.
వీళ్ళు పిసినారులంటే అసలు ఖర్చు పెట్టరని కాదు. వాళ్ళు అద్దె, EMI, పెట్టుబడుల విషయంలో మంచి ప్రణాళిక కలిగి ఉంటారు. అప్పులు చేయడం ఇష్టపడరు. నష్టాలు వచ్చే చోట్లను గుర్తించి దూరంగా ఉంటారు. పొదుపు ఆధారంగా వ్యాపారంలో రాణిస్తారు.
55
సంతోషాలను పక్కన పెడతారు..
ఖర్చుల కంట్రోల్ లో సుఖాన్ని మర్చిపోతారు. కఠిన నియంత్రణ వల్ల జీవితం కష్టమవుతుంది. సంతోషాన్ని వాయిదా వేసే అలవాటు ఉంటుంది. కుటుంబానికి దగ్గరగా ఉండడంలో ఇబ్బంది పడతారు.
మీ చెెప్పిన తేదీల్లో మీరు కూడా పుట్టి ఉంటే.. డబ్బు విషయంలో మీకు కంట్రోల్, ప్లానింగ్, పొదుపు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇది మంచిదా, చెడ్డదా అనేది మీ దృక్పథం మీద ఆధారపడి ఉంటుంది. పిసినారితనం తప్పు కాదు. కానీ జీవితంలో కొన్ని సంతోషాలు ఖర్చులలోనే ఉంటాయని మర్చిపోకండి.