ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
213
మేష రాశి ఫలాలు
బంధువులతో ఉన్న సమస్యలు తొలగుతాయి. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. వృత్తి, వ్యాపారాలు ఆశించిన స్థాయిలో రాణిస్తాయి. చేపట్టిన పనులు సాఫీగా సాగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంటా బయటా అనుకూల వాతావరణం ఉంటుంది.
313
వృషభ రాశి ఫలాలు
సన్నిహితుల నుంచి అవసరానికి డబ్బు సహాయం అందుతుంది. చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు కొంత ఇబ్బంది పెడతాయి.
చేపట్టిన పనులలో శ్రమ అధికమవుతుంది. బంధువుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. వృథా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. వృత్తి, ఉద్యోగాలలో కష్టానికి తగిన ఫలితం దక్కదు. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఇంటా బయటా గందరగోళ పరిస్థితులు ఉంటాయి.
513
కర్కాటక రాశి ఫలాలు
సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. నూతన కార్యక్రమాలు చేపట్టి విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యుల మద్ధతు లభిస్తుంది. ఉద్యోగాలలో సంతృప్తికర వాతావరణం ఉంటుంది.
613
సింహ రాశి ఫలాలు
కుటుంబ వ్యవహారాలు ఇబ్బంది పెడతాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలలో ఆటంకాలు కలుగుతాయి. దైవ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు మందగిస్తాయి. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి. ఉద్యోగాలలో సమస్యాత్మక వాతావరణం ఉంటుంది.
713
కన్య రాశి ఫలాలు
ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నాయి. ప్రముఖులతో పరిచయాలు విస్తృతం అవుతాయి. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. స్థిరాస్తి క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో మరింత రాణిస్తారు.
813
తుల రాశి ఫలాలు
వృత్తి, వ్యాపారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబ పెద్దలతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. కొందరి ప్రవర్తన మానసికంగా బాధిస్తుంది. బంధువుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. పెట్టుబడుల విషయంలో పునరాలోచన చేయటం మంచిది. నిరుద్యోగుల ప్రయత్నాలు మందగిస్తాయి.
913
వృశ్చిక రాశి ఫలాలు
ఇంటా బయటా బాధ్యతలు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. సన్నిహితులతో మాటపట్టింపులుంటాయి. కొన్ని వ్యవహారాలలో సొంత ఆలోచనలు కలిసిరావు. వ్యాపారాలు కొంత మందగిస్తాయి. ఉద్యోగాలలో చికాకులు పెరుగుతాయి.
1013
ధనుస్సు రాశి ఫలాలు
వృథా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కుటుంబ సభ్యులతో ఆలయ దర్శనాలు చేసుకుంటారు. బంధువులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. అనుకున్న పనుల్లో అవాంతరాలు తప్పవు. వ్యాపారాలలో కొంత జాగ్రత్త అవసరం. ఉద్యోగులకు పని ఒత్తిడి పెరుగుతుంది.
1113
మకర రాశి ఫలాలు
స్నేహితులతో మాటపట్టింపులు ఉంటాయి. అవసరానికి చేతిలో డబ్బు ఉండదు. వాహన ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు కొంత మందకొడిగా సాగుతాయి. వృత్తి, ఉద్యోగాలలో పని ఒత్తిడి అధికమవుతుంది.
1213
కుంభ రాశి ఫలాలు
చేపట్టిన పనులలో శ్రమ తప్పదు. ముఖ్యమైన పనులలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ఇంటా బయటా పరిస్థితులు అనుకూలిస్తాయి. మిత్రుల వల్ల ఊహించని సమస్యలు వస్తాయి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి.
1313
మీన రాశి ఫలాలు
చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థికంగా చికాకులు తొలగుతాయి. నూతన వ్యక్తుల పరిచయాలు లాభసాటిగా ఉంటాయి. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపారాలు అనుకూలం. నిరుద్యోగుల శ్రమ ఫలిస్తుంది.