Saraswati Rajayogam: మిథున రాశిలో అరుదైన రాజయోగం.. ఈ 6 రాశులవారి పంట పండినట్లే!

Published : May 29, 2026, 03:41 PM IST

Saraswati Rajayogam: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నేడు (మే 29న) మిథున రాశిలో బుధ, గురు, శుక్ర గ్రహాల కలయిక వల్ల అత్యంత అరుదైన సరస్వతీ రాజయోగం ఏర్పడింది. ఈ యోగం ప్రభావం వల్ల 6 రాశులవారికి అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి. ఆ రాశులేవో తెలుసుకోండి.

PREV
16
వృషభ రాశి

మిథున రాశిలో బుధ, గురు, శుక్రుల కలయిక వల్ల ఏర్పడిన సరస్వతీ రాజయోగం వృషభ రాశి వారి ఆర్థికంగా మేలు చేస్తుంది. ఈ రాశివారు  డబ్బు సంపాదించడమే కాదు, పొదుపు చేయడంలోనూ సక్సెస్ అవుతారు. వారసత్వ ఆస్తి లేదా ఆకస్మిక ధనలాభం పొందే అవకాశం ఉంది. మీ మాటతీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. పెండింగ్ పనులు, బిజినెస్ డీల్స్ చకచకా పూర్తవుతాయి.

26
మిథున రాశి

సరస్వతీ రాజయోగం మిథున రాశి వారి వ్యక్తిత్వాన్ని మెరుగుపరుస్తుంది. సమాజంలో పేరు ప్రతిష్ఠలు పెరుగుతాయి. పనిచేసే చోట గౌరవం పెరుగుతుంది. మీ తెలివితేటలతో కొత్త అవకాశాలను పొందుతారు. ఇంటా బయటా అనుకూల వాతావరణం ఉంటుంది. మీడియా, రచన లేదా విద్యా రంగాల్లో ఉన్నవారికి ఇది మంచి సమయం. గొప్ప విజయాలు సాధించే అవకాశం ఉంది. 

36
సింహ రాశి

సింహ రాశి వారికి సరస్వతీ యోగం కొత్త ఆదాయ మార్గాలను తెరుస్తుంది. ఎప్పటి నుంచో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. గతంలో నిలిచిపోయిన డబ్బు తిరిగి చేతికి అందుతుంది. పెట్టుబడులు పెట్టడానికి ఇది అనుకూల సమయం. కొన్ని ముఖ్యమైన పనులు స్నేహితుల సాయంతో పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగాలలో ఊహించని లాభాలు అందుకుంటారు. 

46
కన్య రాశి

కన్య రాశివారికి ఈ రాజయోగం శుభ ఫలితాలను ఇస్తుంది. ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్ లేదా కోరుకున్న చోటుకి బదిలీ అయ్యే అవకాశం రావచ్చు. మీ పనితీరుకు ప్రశంసలు దక్కుతాయి. వృత్తి, వ్యాపారాలు ఆశించిన స్థాయిలో రాణిస్తాయి. కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో ఉపయోగపడే విధంగా ఉంటాయి.

56
తుల రాశి

తుల రాశి వారి అదృష్ట స్థానంలో సరస్వతీ రాజయోగం ఏర్పడుతోంది. దానివల్ల ఈ రాశివారికి అదృష్టం రెట్టింపవుతుంది. ఆగిపోయిన పనులు వేగంగా పూర్తవుతాయి. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థుల కలలు నెరవేరే అవకాశం ఉంది. కుటుంబ జీవితం సంతోషంగా సాగుతుంది.

66
ధనుస్సు రాశి

ధనుస్సు రాశి వారికి సరస్వతి రాజయోగం మంచి ఫలితాలనిస్తుంది. కొత్త వ్యాపారం ప్రారంభించాలి అనుకునేవారికి ఇదే సరైన సమయం. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తి లాభం కలగవచ్చు. బంధువులతో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. అన్నదమ్ములతో సఖ్యత పెరుగుతుంది. ఉద్యోగ, వ్యాపారాలలో మీ ప్రతిభా పాటవాలతో శుభ ఫలితాలు పొందుతారు.

Read more Photos on
click me!

Recommended Stories