దీర్ఘకాలిక సమస్యలు, స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. ధార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాల్లో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.
212
వృషభ రాశి ఫలాలు
ఆర్థిక వ్యవహారాలు చికాకు తెప్పిస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో అవరోధాలు ఉంటాయి. మిత్రులతో దైవదర్శనాలు చేసుకుంటారు. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు కలుగుతాయి. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాల్లో చికాకు వాతావరణం ఉంటుంది.
312
మిథున రాశి ఫలాలు
కొత్త పనులు చేపడతారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నాయి. చాలాకాలంగా పడిన శ్రమకు ఫలితం దక్కుతుంది. విలువైన వస్తు లాభాలు పొందుతారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.
చేపట్టిన పనుల్లో శ్రమ పెరుగుతుంది. బంధువులతో మాటపట్టింపులు కలుగుతాయి. ప్రయాణాల్లో ఆకస్మిక మార్పులు ఉంటాయి. ఇంటా బయట పరిస్థితులు అనుకూలించవు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగంలో అధికారులతో చర్చలు అనుకూలించవు.
512
సింహ రాశి ఫలాలు
ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. సన్నిహితుల నుంచి శుభవార్తలు అందుతాయి. సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. కొత్త ఇంటి నిర్మాణ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.
612
కన్య రాశి ఫలాలు
వివాదానికి సంబంధించి ప్రముఖుల నుంచి అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది. ఆర్థికంగా మరింత మెరుగైన వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో నష్టాల నుంచి బయటపడతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
712
తుల రాశి ఫలాలు
ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. సన్నిహితులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. చేపట్టిన పనులు ఆగిపోతాయి. దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారపరంగా మెరుగైన పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగులకు పని ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది.
812
వృశ్చిక రాశి ఫలాలు
సోదరులతో గొడవలు జరగవచ్చు. కొత్త అప్పులు చేస్తారు. కుటుంబానికి సంబంధించి ఆకస్మికంగా నిర్ణయాలు మార్చుకుంటారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాల్లో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగాల్లో ట్రాన్స్ ఫర్ సూచనలు ఉన్నాయి.
912
ధనుస్సు రాశి ఫలాలు
కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ప్రయాణాల్లో నూతన పరిచయాలు ఏర్పడుతాయి. మిత్రులతో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఉద్యోగాల్లో అంచనాలు నిజమవుతాయి.
1012
మకర రాశి ఫలాలు
భూ వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. చేపట్టిన వ్యవహారాల్లో పురోగతి సాధిస్తారు. ఆకస్మిక ధన లాభం ఉంది. వ్యాపార వ్యవహారాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగాల్లో సమస్యలు పరిష్కారం అవుతాయి.
1112
కుంభ రాశి ఫలాలు
ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. మిత్రులతో కలహా సూచనలు ఉన్నాయి. రుణ ప్రయత్నాలు చేస్తారు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు కలుగుతాయి. వ్యాపారాల్లో కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగులకు అధికారుల నుంచి ఊహించని ఇబ్బందులు ఎదురవుతాయి.
1212
మీన రాశి ఫలాలు
వృథా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ వాతావరణం చికాకుగా ఉంటుంది. ఆరోగ్య సమస్యలు మరింత బాధిస్తాయి. కొన్ని పనులు శ్రమతో కానీ పూర్తికావు. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి.