Zodiac signs: ఈ రాశులవారు డబ్బును మంచి నీళ్లలా ఖర్చు చేస్తారు, ఎంత సంపాదించినా వేస్టే..!

Published : Jul 01, 2025, 03:41 PM ISTUpdated : Jul 01, 2025, 04:54 PM IST

జోతిష్య శాస్త్రం ప్రకారం కూడా కొన్ని రాశుల వారికి డబ్బు ఎలా ఆదా చేయడం తెలీదు. వారికి అవసరమైన వస్తువులపై చాలా ఖర్చు చేసే అలవాటు ఉంటుంది.

PREV
17
డబ్బు ఎక్కువగా ఖర్చు చేసేది వీరే..

జీవితంలో ప్రతి ఒక్కరూ డబ్బు సంపాదించడం కోసమే కష్టపడతారు. డబ్బు సంపాదించడం అందరూ చేస్తారు. కానీ,సంపాదించిన డబ్బును తెలివిగా ఆదా చేయడం, తెలివిగా ఖర్చు చేయడం గొప్ప కళ. కానీ కొందరికి అది సాధ్యం కాదు. జోతిష్య శాస్త్రం ప్రకారం కూడా కొన్ని రాశుల వారికి డబ్బు ఎలా ఆదా చేయడం తెలీదు. వారికి అవసరమైన వస్తువులపై చాలా ఖర్చు చేసే అలవాటు ఉంటుంది. ఈ గుణం కారణంగా, వారి పొదుపు ప్రణాళికలు తరచుగా విఫలమౌతాయి. ఎంతలా అంటే.. డబ్బును మంచి నీళ్ల లా ఖర్చు చేస్తారు. ఎంత సంపాదించినా కూడా అంతే ఈజీగా ఆ డబ్బులు ఖర్చు అయిపోతాయి. మరి, అలాంటి రాశులేంటో చూద్దామా...

27
1.మేష రాశి..

మేష రాశివారికి డబ్బు ఆదా చేయడం అస్సలు రాదు. డబ్బు చాలా ఎక్కువగా ఖర్చు చేస్తారు. వారి కంటికి ఏదైనా నచ్చిందా.. అది అవసరం లేకపోయినా కొనేస్తారు. నచ్చిన దానిని కొనుక్కుకంటే తప్పేంటి అనే భావన వీరిలో చాలా ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగానే వీరు చాలా అనవసరపు ఖర్చు చేస్తూ ఉంటారు.

మేష రాశివారి ఈ అనవసరపు ఖర్చు ఎలా నియంత్రించాలి?

ఏదైనా వస్తువు నచ్చిన వెంటనే కొనకూడదు. అది నిజంగా అవసరమా కాదా అని ఆలోచించాలి. 24 గంటల తర్వాత షాపింగ్ చేద్దాం అనుకోండి. నిజంగా అప్పటికీ మీకు అవసరమే అనిపిస్తే అప్పుడు దానిని కొనే ఆలోచన చేయండి. టైమ్ పాస్ కి షాపింగ్ కి వెళ్తే అనవసరం అయినవి కూడా కొనేస్తాం. అలా కాకుండా.. ఏం కావాలి అని లిస్ట్ రాసుకొని దాని ప్రకారమే కొంటే, చాలా వరకు అవసరం లేని వాటి మీద డబ్బులు ఖర్చు చేయకుండా ఉంటాం.

37
2.మిథున రాశి..

చాలా మంది మిథున రాశివారు కొత్త ట్రెండ్‌లను అనుసరించడానికి చాలా ఆసక్తి చూపుతారు. కొత్త కలెక్షన్లు, టెక్ గాడ్జెట్‌లు లేదా ఫ్యాషన్ వస్తువులు వచ్చినప్పుడు, వారు వాటిని వెంటనే కొనడానికి ఆసక్తి చూపుతారు. ఇది వారి క్రెడిట్ కార్డ్ బిల్లును పెంచుతుంది. అది మనకు అవసరమా కాదా అనే విషయాన్ని ఆ సమయంలో వారు ఆలోచించరు. కొనేసిన తర్వాత ఫీలౌతారు.

మనం దీన్ని ఎలా నియంత్రించగలం?

"ఇది నిజంగా అవసరమా?" అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి.

ముందుగా మీ దగ్గర ఉన్న పాత వస్తువులను అమ్మడానికి ప్రయత్నించండి, తర్వాత కొత్త వస్తువులను కొనండి.

47
3.సింహ రాశి..

సింహ రాశికి చెందిన చాలా మంది ఎక్కువగా విలాసవంతమైన వస్తువులపై ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తారు. వారు బ్రాండెడ్ వస్తువులు, లగ్జరీ కార్లు, ఖరీదైన ఆభరణాలను కొనడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. ఈ అలవాటు వారి పొదుపును బాగా ప్రభావితం చేస్తుంది. ఎంత సంపాదించినా.. ఏదో ఒక రూపంలో ఖర్చు అయిపోతుంది.

మనం దీన్ని ఎలా నియంత్రించగలం?

నాణ్యమైన కానీ చవకైన ఎంపికలను ఎంచుకోండి.

నెలలో లగ్జరీ ఖర్చులను 50% తగ్గించడానికి ప్రయత్నించండి.

57
4.తుల రాశి..

చాలా తులారాశి వారు ఒత్తిడికి గురైనప్పుడు లేదా ఆందోళన చెందుతున్నప్పుడు చాలా షాపింగ్ చేస్తారు. కొత్త వస్తువులను కొనడం మనశ్శాంతి పొందడానికి తాత్కాలిక పరిష్కారం కావచ్చు. కానీ ఇది తరువాత పశ్చాత్తాపానికి దారితీస్తుంది. కొనేదాక ఆగలేరు.. కొన్న తర్వాత ఫీలౌపోతారు. డబ్బులు అన్నీ ఖర్చు చేసేశాం అని ఫీలౌతారు.

మనం దానిని ఎలా నియంత్రించగలం?

ఒత్తిడి పెరిగినప్పుడు వ్యాయామం చేయండి లేదా ధ్యానం చేయండి.

నిజంగా ఈ వస్తువు నాకు అవసరమా? ఇది నాకు ఉపయోగపడుతుందా అనే విషయాలు ఆలోచించి తర్వాతే కొనాలి.

67
5.ధనస్సు రాశి..

ధనుస్సు రాశి వారు తమను తాము నియంత్రించుకోలేక డబ్బు వృధా చేసుకుంటారు. వారికి అవసరం లేని అనేక వస్తువులను కొనుగోలు చేసే అలవాటు ఉంది. వారు "ఇది చిన్న ఖర్చు" అని ఆలోచిస్తూ చాలా చిన్న ఖర్చులు చేస్తారు, ఆపై పెద్ద మొత్తాన్ని కోల్పోతారు. తెలీకుండానే ఎక్కువగా ఖర్చు చేసేస్తారు.

మనం దానిని ఎలా నియంత్రించగలం?

మీరు రోజుకు ఎంత ఖర్చు చేయవచ్చో పరిమితిని నిర్ణయించండి.

నగదును మాత్రమే ఉపయోగించండి. క్రెడిట్ కార్డ్ వాడకాన్ని తగ్గించండి.

77
6.మీన రాశి...

చాలా మంది మీన రాశి వారు కలలు కనేవారు. వారు అందమైన వస్తువులను చూసినప్పుడు, వాటి వల్ల తమకు ఉపయోగం లేదని తెలిసినా కూడా కొనేస్తారు. వారు "ఇది నా కల" అని అనుకుంటారు. అనవసరమైన వస్తువులపై డబ్బు వృధా చేస్తారు.

మనం దానిని ఎలా నియంత్రించగలం?

ఏదైనా కొత్త వస్తువును కొనుగోలు చేసే ముందు, అది నిజంగా ఉపయోగకరంగా ఉందో లేదో పరిశీలిచండి.నెలవారీ ఖర్చు బడ్జెట్‌ను సిద్ధం చేసి అనుసరించండి.

కొంతమందికి, వారి రాశిచక్రం ప్రకారం, అనవసరంగా డబ్బు ఖర్చు చేసే అలవాటు ఉండవచ్చు. కానీ దీనిని చిన్న ప్రయత్నాలతో నియంత్రించవచ్చు. మీరు లిస్ట్ తయారు చేసుకొని ట్రాక్ చేసుకుంటూ ఉంటే.. ఖర్చులు కంట్రోల్ చేసుకోవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories