10.09.2025 బుధవారానికి సంబంధించిన కర్కాటక రాశి ఫలాలు ఇవి. నేడు ఈ రాశివారికి ఆరోగ్యం, వ్యాపారం, ఉద్యోగాల్లో ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
కర్కాటక రాశి ఫలాలు (పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష)
నేడు కర్కాటక రాశి వారి జాతకం ఎలా ఉండనుంది? ఈ రాశివారికి కలిగే లాభాలు, నష్టాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్న వివరాలు ఇలా ఉన్నాయి. ఓసారి తెలుసుకుందామా...
25
కుటుంబ జీవితం
నేడు కర్కాటక రాశివారికి బంధువులతో అకారణంగా విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. అపార్థాల వల్ల అనవసరమైన వివాదాలు వస్తాయి. కాబట్టి ఈ రాశి వారు ఓర్పుతో వ్యవహరించాలి. సంయమనం, నిగ్రహం పాటించకపోతే సన్నిహితులతో సంబంధాలు దెబ్బతినే ప్రమాదం ఉంది.
35
ఆర్థిక పరిస్థితి
ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి. అనుకోని ఖర్చులు, కుటుంబ అవసరాలు, వైద్య ఖర్చుల వంటివి పెరిగే అవకాశం ఉంది. దానివల్ల ఈ రాశివారు కొత్త అప్పులు చేయాల్సి వస్తుంది. అయితే అప్పుల బారిన పడకుండా ఉండాలంటే ఖర్చులపై నియంత్రణ, ప్రాధాన్యత ఆధారంగా ఖర్చు చేయడం తప్పనిసరి.
ఉద్యోగ, వ్యాపారాల్లో ఆకస్మిక మార్పులు, మారిన నిబంధనలు, కొత్త విధానాలు కొంత చికాకు కలిగించవచ్చు. చేపట్టిన పనులు సజావుగా సాగక.. ఫలితాలు ఆలస్యంగా వస్తాయి. కష్టానికి తగిన గుర్తింపు దక్కకపోవడం వల్ల కొంత నిరాశ కలుగుతుంది.
55
సూచనలు
మానసిక ప్రశాంతత కోసం ఆలయ దర్శనాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం మంచిది. ధ్యానం, పూజల వంటివి మనోధైర్యాన్ని పెంపొందిస్తాయి.