జోతిష్యశాస్త్రంలో.. డబ్బు గురు, శుక్ర గ్రహాలకు సంబంధించినది. ఈ రెండు గ్రహాలు మన జీవితంలో శ్రేయస్సు, సంపదను సూచిస్తాయి. గ్రహాల కదలికల కారణంగా ఈ రాశులవారు ఎక్కువ సంపదను కూడపెట్టుకునే అవకాశం ఉంది. గురుడు ధనస్సు, మీన రాశులకు అధిపతి. ఈ గురుడు అదృష్టం , విజయం, శ్రేయస్సును సూచిస్తాయి. ఇక శుక్రుడు వృషభ, తుల రాశులకు అధిపతి. ఈ గ్రహం ప్రేమ, విలాసవంతమైన జీవితం, ఆర్థిక విలువలను సూచిస్తాడు.ఈ గ్రహాల కదలికలన్నీ కలిసి ఈ ఏడాది కొన్ని రాశులను ధనవంతులు చేయనున్నాయి. మరి, ఆ రాశులేంటో చూద్దాం..