కుజుడు ఏ రాశికి లగ్నం, చతుర్థం, సప్తమం లేదా దశమ స్థానాల్లో ఉచ్ఛ స్థితిలో లేదా స్వక్షేత్రంలో ఉన్నప్పుడు ఈ యోగం ఏర్పడుతుంది. ఈ స్థితి వ్యక్తిలో నాయకత్వ లక్షణాలు, ధైర్యం, నిర్ణయశక్తిని పెంచుతుంది. జీవితంలో సాధారణ స్థాయి నుంచి ఉన్నత స్థాయికి చేరే అవకాశాలు బలపడతాయి.
ఈసారి కుజ గ్రహం తన ఉచ్ఛ రాశి అయిన మకరంలో సంచారం చేయడం వల్ల మేషం, కర్కాటకం, తుల, మకర రాశులకు రుచక మహా పురుష యోగం ఏర్పడింది. ఈ రాశుల వారికి ధనం, పదవి, గౌరవం లభించే సూచనలు కనిపిస్తున్నాయి.