Head Bath: ప్రతి ఒక్కరూ వారానికి ఒక్కసారైనా తలస్నానం చేస్తారు. కానీ, తల స్నానం చేసే విషయంలో కూడా కొన్ని నియమాలున్నాయి. తల స్నానం ఏ రోజున చేయడం శుభప్రదం.. ఏ రోజున తల స్నానం చేయడం దురదృష్టాన్ని తెస్తుందో తెలుసుకుందాం..
సాధారణంగా చాలా మంది వారానికి ఒకసారి లేదా రెండుసార్లు తలస్నానం చేస్తారు. అందులోనూ చాలామంది ఆదివారం తలస్నానం చేస్తారు. కానీ, తలస్నానం వెనుక కూడా శుభ–అశుభాలు ఉంటాయని చెబితే చాలా మందికి ఆశ్చర్యం కలగచ్చు. పంచాంగం ప్రకారం కొన్ని దినాల్లో తలస్నానం చేయకూడదన్న నమ్ముతారు.
27
తలస్నానం ఏ రోజుల్లో చేయాలి ?
శాస్త్రాలు, ఆధ్యాత్మిక గ్రంథాలు ప్రకారం తలస్నానానికి సంబంధించి కొన్ని నిబంధనలు ఉన్నాయి. కొన్ని రోజులలో తలస్నానం చేయడం శ్రేయస్కరం కాగా, కొన్ని రోజులు తలస్నానం చేయకూడదని చెబుతారు. అలాంటప్పుడు ఏ రోజుల్లో తలస్నానం చేయాలి? ఏ రోజుల్లో చేయకూడదు? అనే విషయాన్ని ఒకసారి పరిశీలిద్దాం..
37
తలస్నానం చేయడానికి ఏ రోజు మంచిది?
సాధారణంగా ఆదివారం సెలవు దినం కావడంతో చాలామంది ఆ రోజున తలస్నానం చేయడం ఆనవాయితీగా మారింది. మహిళలు రుతుక్రమం సమయంలో శరీర శుభ్రత కోసం తలస్నానం చేస్తారు. అలాగే, చాలా మంది పురుషులు రోజూ తలస్నానం చేయడం పరిపాటి. చాలా చోట్ల ఆడపిల్లలు కూడా ప్రతి రోజూ తలస్నానం చేయడం అలవాటుగా పరిగణించబడుతుంది. ఇది కేవలం శుభ్రత కోసం మాత్రమే కాదు, ఆధ్యాత్మిక శుద్ధి, రోజుకు శుభారంభం అన్న భావనతో కూడిన ప్రాచీన సంప్రదాయం.
తల స్నానం ఆరోగ్యాన్ని మెరుగుపరిచే అంశం అయితేనే గానీ, శాస్త్రాలు, పంచాంగ విశ్వాసాల ప్రకారం కొన్ని ప్రత్యేక దినాల్లో తలస్నానం చేయకూడదని చెప్పడం కనిపిస్తుంది. అందులో ముఖ్యంగా మంగళవారం, శనివారాల్లో తలస్నానం చేయకూడదని చెబుతారు. ఈ రోజుల్లో తలస్నానం చేయడం వల్ల దినచర్యలో జాప్యం, అలసట, శరీర శక్తి తగ్గిపోవడం, అశుభ ఫలితాలు వస్తాయని విశ్వాసం.
57
ఆదివారం తలస్నానం... శుభమా? ఆ శుభమా?
చాలామందికి ఆదివారం సెలవుదినం కావడం వల్ల ఆ రోజున తలస్నానం చేయడం పరిపాటిగా మారింది. కానీ ధార్మిక గ్రంథాలు, కొన్ని ఆచార శాస్త్రాల ప్రకారం ఆదివారం తలస్నానం చేయడం శుభ ఫలితాలు అందుతాయంట. అయితే కొంతమంది మాత్రం ఆదివారం నాడు తలస్నానం చేస్తే.. శరీర శక్తి తగ్గుతుందని నమ్ముతారు.
అలాగే, గురువారం తలస్నానం చేయకూడదనీ, ఈ రోజు బృహస్పతి గ్రహానికి సంబంధించినదిగా పరిగణించబడుతుంది. ఈ రోజున తలస్నానం చేస్తే ఆధ్యాత్మిక శక్తి మందగిస్తుందని, అలాగే అదనపు ఖర్చులు, అనవసరమైన పనుల భారం పెరుగుతుందని కొందరి నమ్మకం.
67
ఈ మూడు రోజుల్లో తలస్నానం చేస్తే..
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సోమవారం, బుధవారం, శుక్రవారం తలస్నానం చేయడం శుభదాయకం. ఈ రోజుల్లో తలస్నానం చేయడం వల్ల సంపద, ఐశ్వర్యం వరిస్తుందని నమ్మకం. అలాగే.. ఇంటిలో శాంతి, ఆనంద వాతావరణం ఏర్పడుతుందని విశ్వాసం. జీవిత భాగస్వామితో మధురమైన సంబంధం కొనసాగుతుందని శాస్త్రాలు సూచిస్తాయి.
77
తలస్నానం చేసేటప్పుడు వారాలు గుర్తుపెట్టుకోండి
ఇకపై మీరు తలస్నానం చేసే రోజును ఎంచుకునేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి. ఎందుకంటే కొన్ని వారాలలో తలస్నానం చేయడం వల్ల శుభఫలితాలు, అదృష్టం కలిగిస్తుందని, మరికొన్ని వారాలలో చేయడం అశుభం, దురదృష్టానికి కారణమవుతుందని ఆచార శాస్త్రాలు చెబుతున్నాయి. అయితే.. ఇది కేవలం నమ్మకం మాత్రమే.