Jupiter Transit: గురు సంచారం.. ఈ నాలుగు రాశులకు అన్నీ మంచి రోజులే ఇక!

Published : Jul 24, 2025, 09:45 AM IST

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. గురువు ప్రస్తుతం మిథున రాశిలో ఉన్నాడు. త్వరలో కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. దానివల్ల హంస మహాపురుష రాజయోగం ఏర్పడుతుంది. ఈ యోగం వల్ల 4 రాశులవారికి ధనలాభం కలుగుతుంది. మరి ఆ రాశులేంటో చూద్దామా..  

PREV
15
హంస మహాపురుష రాజయోగం..

జ్యోతిష్య శాస్త్రంలో గురు గ్రహానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. గురువుని జ్ఞానం, బుద్ధి, ఆధ్యాత్మికత, అదృష్టం, సంపదలకు కారకుడిగా భావిస్తారు. గురువు ధనుస్సు, మీన రాశులకు అధిపతి. గురువు ఒక రాశి నుంచి మరొక రాశికి వెళ్లడానికి దాదాపు 13 నెలలు పడుతుంది. ప్రస్తుతం గురువు మిథున రాశిలో ఉన్నాడు. అక్టోబర్ లో తన ఉచ్ఛ రాశి అయిన కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. దీనివల్ల హంస మహాపురుష రాజయోగం ఏర్పడుతుంది. ఇది 4 రాశుల వారికి అదృష్టాన్ని తెస్తుంది. ఆ రాశులేంటో ఇక్కడ చూద్దాం. 

25
మిథున రాశి

హంస మహాపురుష రాజయోగం మిథున రాశి వారికి శుభప్రదం. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. మీ జీవితంలో ఆనందం వెల్లివిరుస్తుంది. అదృష్టం మీ వెంటే ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. దాంపత్య జీవితం అద్భుతంగా ఉంటుంది. పెళ్లికానివారికి వివాహ ప్రతిపాదనలు రావచ్చు. నిరుద్యోగులకు ఉద్యోగాలు లభించవచ్చు.

35
కర్కాటక రాశి

కర్కాటక రాశివారికి హంస రాజయోగం ప్రయోజనకరం. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. దాంపత్య జీవితం బాగుంటుంది. ఉద్యోగంలో పదోన్నతి దక్కుతుంది. వ్యాపారంలో లాభాలు వస్తాయి. విద్యార్థులు చదువులో విజయం సాధిస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది.

45
కన్య రాశి

కన్య రాశివారికి హంస రాజయోగం మేలు చేస్తుంది. ఈ రాశివారికి ఆదాయం పెరుగుతుంది. ఈ సమయంలో పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆగిపోయిన డబ్బు తిరిగి వస్తుంది. ఉద్యోగం, వ్యాపారాల్లో పురోగతి ఉంటుంది. పిల్లలకు సంబంధించి శుభవార్తలు అందుతాయి. కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది.

55
తుల రాశి

హంస రాజయోగం ఏర్పడటం వల్ల తుల రాశి వారికి అదృష్టం కలిసివస్తుంది. వ్యాపారంలో మంచి పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు వస్తాయి. బదిలీతో పాటు పదోన్నతి కూడా లభించవచ్చు. తండ్రితో సంబంధాలు బలపడతాయి. నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయి. వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి.

Read more Photos on
click me!

Recommended Stories