ఈ 4 నెలల్లో పుట్టినవారు పైకి ఒకలా.. లోపల మరోలా ఉంటారు! ఎందుకో తెలుసా?

Published : Sep 17, 2025, 03:01 PM IST

Birth Month: ప్రతి నెలకు ఒక ప్రత్యేకత ఉంటుంది. ఒక్కో నెలల పుట్టిన వారు ఒక్కోలా ఉంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని నెలల్లో పుట్టిన వారు చాలా స్వార్థపరులుగా కనిపిస్తారు. కానీ నిజానికి వారి స్వభావం అలా ఉండకపోవచ్చు. ఆ నెలలేంటో చూద్దామా.. 

PREV
15
Birth Month Astrology

జ్యోతిషశాస్త్రం ప్రకారం పుట్టిన నెల వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేస్తుంది. కొన్ని నెలల్లో పుట్టినవారు తమ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తూ, ఇతరుల గురించి తక్కువగా ఆలోచిస్తారని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. మరి ఏ నెలల్లో పుట్టినవారు ఇలా ఉంటారో ఇక్కడ తెలుసుకుందాం. 

25
జనవరి

జనవరిలో పుట్టినవారు తమ లక్ష్యాలపై ఎక్కువ దృష్టి పెడతారు. జీవితంలో ముందుకు సాగడానికే ప్రాధాన్యత ఇస్తారు. అందుకే కొన్నిసార్లు ఇతరుల అవసరాలను పట్టించుకోరు. వీరి దృఢ వైఖరి కొందరికి స్వార్థంగా కనిపించినా.. అది వారి గెలుపు తపనకు నిదర్శనం.

35
ఏప్రిల్

ఏప్రిల్‌లో పుట్టినవారు ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. తమ కోరికలు నెరవేర్చుకోవడం కోసం తీవ్రంగా శ్రమిస్తారు. ఈ క్రమంలో ఇతరుల సంబంధాలను పట్టించుకోకుండా, లక్ష్యాలపైనే దృష్టి పెడతారు. వీరి స్వేచ్ఛా స్వభావాన్ని కొన్నిసార్లు ఎదుటివారు స్వార్థంగా అపార్థం చేసుకుంటారు.

45
ఆగస్టు

ఆగస్టులో పుట్టినవారు అందరి దృష్టిని ఆకర్షించాలని కోరుకుంటారు. తమ అవసరాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. సొంత ప్రయోజనాలకే విలువ ఇవ్వడం వల్ల ఇతరుల అంచనాలను అందుకోలేరు. ఈ లక్షణం స్వార్థంగా కనిపించినా, అది వారి ప్రత్యేకతను చూపే విధానం.

55
నవంబర్

నవంబర్ నెలలో పుట్టినవారు లోతైన ఆలోచనలు కలిగి ఉంటారు. తమ భావాలను దాచుకుంటారు. వీరు తమ అంతరాత్మ చెప్పినట్లే వింటారు. కాబట్టి, ఇతరుల అవసరాలను పట్టించుకోనట్లు కనిపించవచ్చు. వీరి రహస్య స్వభావం కొందరికి స్వార్థంగా అనిపించవచ్చు. కానీ వారు తమ అంతర దృష్టిని గౌరవించడం వల్లే ఇతరులకు స్వార్థపరులుగా కనిపిస్తారు.

గమనిక

ఈ కథనంలో పేర్కొన్న సమాచారం జ్యోతిష్య నిపుణుల అభిప్రాయాలు, మత గ్రంథాలు, పంచాంగంపై ఆధారపడి ఉంటుంది. దీన్ని ఏషియానెట్ తెలుగు ధృవీకరించలేదు.  

Read more Photos on
click me!

Recommended Stories