
Shani Transit : రాశిపలాలు, జ్యోతిష్యం, వాస్తు, సంఖ్యాశాస్త్రం.. ఇలాంటివి చాలామంది జీవితాల్లో కీలకపాత్ర పోషిస్తారు. చాలామంది వీటిని నమ్ముతారు.. కొందరికి వీటిపై నమ్మకం ఉండదు. అయితే వీటిని నమ్మనివారు కూడా శని ప్రభావాన్ని గుర్తిస్తుంటారు... ఏదైనా పని జరక్కపోయితే 'నా నెత్తిన శని ఉన్నట్లుంది' అని... ఎవరైనా నష్టాన్ని కలిగించినా, ఇబ్బందిపెట్టినా 'శనిలా తగులుకున్నాడు' అని అంటుంటారు. ఇలా నిత్యజీవితంలోప్రతిఒక్కరూ శని అనే పదం వాడుతుంటారు.. శని ప్రభావంపై మనుషులకు ఎంత నమ్మకం ఉందో దీన్నిబట్టే అర్థమవుతుంది.
అయితే శని ప్రభావంవల్ల కేవలం అశుభాలే కాదు కొన్నిసార్లు శుభాలు కూడా జరుగుతాయి. ఇందుకు ఏ రాశివారికి శని ఏ స్థానంలో ఉన్నాడన్నది కీలకంగా మారుతుంది. గ్రహాల్లోకెల్ల అత్యంత శక్తివంతమైన శని కొన్ని రాశులవారికి శుభాలు కలిగించే స్థానంలో ఉంటే మరికొన్ని రాశులవారికి అశుభాలు కలిగించే స్థానంలో ఉంటాడు. రోజులు గడుస్తున్నకొద్ది శని స్థానం మారుతుంది... దీంతో ఆయా రాశులవారి జాతకాలు కూడా మారతాయి. ఇలా ప్రస్తుతం మీనరాశిలో కొనసాగుతున్న శని కొన్ని రాశులవారికి ఇన్నాళ్ళు కష్టనష్టాలను కలిగించగా తాజాగా శుభాలు కలిగించే స్థానాల్లోకి చేరుకుంటున్నాడు. ఇలా ఓ ఐదు రాశులవారికి ఇక శని తొలగినట్లే... వారికి అన్నీ శుభాలే కలుగుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు.
ఇంతకాలం శని ప్రభావంతో మేషం, సింహం, కన్య, కుంభం, మీన రాశుల్లో పుట్టినవారు అనేక ఇబ్బందులకు, కష్టనష్టాలను చవిచూశారు. ఇలా ఇంతకాలం వీరికి అశుభాలు కలిగించి శని శుభాలు కలిగిస్తాడని... ఓ రెండుమూడు నెలలు వీరికి రాజయోగమేనని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఇలా ఏ రాశులవారిగా కలిగే మంచి ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.
ఈ రాశివారికి శని అనుకూల స్థానంలో ఉండటంవల్ల ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఉద్యోగం రావచ్చు... అల్రెడీ ఉద్యోగం చేస్తున్నవారు జీతం పెంపు, ప్రమోషన్ వంటి శుభవార్తలు వింటారు. ఇలా నిరుద్యోగులు ఉద్యోగులుగా, ఉద్యోగులు ఉన్నతోద్యోగులు మారే అవకాశాలుంటాయి. వృత్తిపరంగానే కాదు వ్యక్తిగత జీవితంలోనూ శుభవార్తలు వింటారు. అవివాహితులకు మంచి పెళ్ళి సంబంధం కుదరడం, ఎంతో కాలంగా కొనసాగుతున్న ఆస్తివివాదాలు తొలగడం వంటివి జరుగుతాయి. మొత్తంగా మేషరాశివారికి గుడ్ టైమ్ స్టార్ట్ అయినట్లే అన్నమాట.
శని ప్రభావంతో ఈ రాశిలో పుట్టినవారు పేరులో మాదిరిగానే ఇకపై సింహాలుగా మారతారు. వీరికి అష్టమ శని దోషం పూర్తిగా తొలగిపోతుంది. దీనివల్ల డబ్బులకు కొదవ ఉండదు... రావాల్సిన డబ్బు అందడం లేదా జీతభత్యాలు పెరగడం లేదా మరే రకంగా అయినా ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ఇళ్లు కట్టుకోవడం, వాహనాల కొనుగోలు, కొత్త వ్యాపారం ఇలా జీవితాన్ని మలుపుతిప్పే పనులు చేస్తారు.
ఈ రాశివారు కొంతకాలంగా శని ప్రభావంతో కష్టనష్టాలను చవిచూశారు... ఇప్పుడు అదే శని వారికి శుభం చేకూర్చనుంది. ఆస్తిపాస్తులు కలిసిరావడం, విదేశీయానం, మంచి గుర్తింపు, అనారోగ్య సమస్యలు తొలగిపోవడం, ఖర్చులు తగ్గి ఆదాయం పెరగడం... ఇలా అంతా మంచే జరుగుతుంది. ఈ రాశివారు ఏది చేసినా విజయమే... ఏది పట్టినా బంగారమే అన్నట్లుగా పరిస్థితి మారిపోతుంది.
ఈ రాశివారికి ఇంతకాలం ఏలిననాటి శని కొనసాగింది... ఇది ఇకపై ఉండదు. దీంతో ఇంతకాలం ఇబ్బందిపడ్డవారి జీవితం ఇకపై హాయిగా సాగుతుంది. సమస్యలు, ఒత్తిళ్లు తొలగిపోయిన పరిస్థితులన్నీ అనుకూలంగా మారిపోతాయి. ఉద్యోగం, వ్యాపారంలోనే కాదు వ్యక్తిగత జీవితంలోనూ అంతా మంచే జరుగుతుంది. ఈ రాశివారికి కుటుంబపరంగా శుభకార్యాలు జరిగి ఆనందం దక్కుతుంది.
ఈ రాశివారికి ఏలిననాటి శని దోషం ఉన్నా గురువు పంచమస్థానంలో ఉండటంవల్ల ఆ ప్రభావం తక్కువగా ఉంటుంది. అందుకే మరీ జీవితం సమస్యలతో సాగిపోకుండా కొంచెం చేదు, కొంచెం తీపి అన్నట్లుగా సాగుతుంది. పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ రెండూ బ్యాలన్స్ గా సాగుతాయి. శని ప్రభావం తగ్గి, గురువు ప్రభావం పెరిగేకొద్ది ఉద్యోగ, వ్యాపారాల్లో వృద్ది కనిపిస్తుంది.
ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం, సాధారణ జ్యోతిష్య అంచనాల ఆధారంగా రాయబడింది. దీని కచ్చితత్వాన్ని ఏషియానెట్ తెలుగు నిర్ధారించదు. పూర్తి వివరాలకు జ్యోతిష్యులను సంప్రదించడం మంచిది