Zodiac sign: ఈ రాశి వారు మాట్లాడే ముందు జాగ్ర‌త్త‌గా ఉండాలి.. అన‌వ‌స‌ర గొడ‌వ‌లు త‌ప్ప‌వు

Published : Jul 07, 2025, 05:54 PM IST

మ‌నిషి శాస్త్ర సాంకేతంగా ఎంత ఎదిగినా ఇప్ప‌టికీ జ్యోతిష్యాన్ని విశ్వ‌సించే వారు మ‌న‌లో చాలా మంది ఉంటారు. గ్ర‌హాల క‌ద‌లిక‌లు మ‌న జీవితంపై ప్ర‌భావాన్ని చూపుతాయి. మ‌రి ఈ వారం కుంభ‌రాశి వారి ఫ‌లితం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. 

PREV
15
వృత్తిలో పురోగ‌తి

ఈ వారం కుంభరాశి వారికి ప‌ని ప్ర‌దేశంలో స్థిరమైన పురోగతి కనిపిస్తుంది. మంచి ప్రణాళికతో ప్రారంభించిన పనులు మంచి ఫలితాన్నిస్తాయి. మెరుగైన పనితీరుతో గుర్తింపు పొందే అవకాశం ఉంటుంది. ఉద్యోగస్తులకు యాజమాన్యం నుంచి ప్రశంసలు ద‌క్కుతాయి. వ్యాపారవేత్తలకు పెద్ద లాభాలు లేకపోయినా, నష్టాలు ఉండ‌వు. ఆస్తి వివాదాలకు పరిష్కార మార్గం కనిపించే సూచనలు కనిపిస్తున్నాయి.

25
సంయమనంతో ఉండాలి

ఇంటి వ్యవహారాల్లో ఈ వారం సంయమనంతో వ్యవహరించడం అత్యంత ముఖ్యం. బంధువుల భావాలను గౌరవించకపోతే చిన్న విషయాలు పెద్దవిగా మారే ప్రమాదం ఉంది. కుటుంబంలో కలహాలకు దూరంగా ఉండాలంటే విన‌యంతో మాట్లాడాలి. ప్రేమ సంబంధాల్లోనూ అప్రమత్తంగా ఉండాలి. భావోద్వేగానికి లోనై మాట్లాడే మాటలు అనవసర అపార్థాలకు దారి తీసే అవకాశం ఉంది.

35
ఆరోగ్యంపై శ్రద్ధ

ఈ వారం ఆరోగ్య పరంగా పెద్ద సమస్యలు రావు. అయితే, అజాగ్రత్త వల్ల కొన్ని ర‌కాల‌ ఇన్‌ఫెక్షన్లు, అలసట వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. పది నిమిషాల పాటు ధ్యానం లేదా ప్రాణాయామం చేస్తూ మానసిక ప్రశాంతత పెంచుకోవచ్చు. భోజన సమయాలు, నిద్రపోవడం వంటి విషయాల్లో క్రమం పాటించాలి.

45
అధ్యాత్మిక పరిహారం

ఇంటిలో శాంతి, వ్యక్తిగత స్థిరత కోసం ఒక వారం పాటు ప్రతిరోజూ సుందరకాండ పారాయణం చేయడం ఎంతో శ్రేయస్కరం. ఇది మానసిక స్థిరతకు తోడ్పడుతుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేలా ఉంటుందీ పరిహారం.

55
ప్ర‌తీ విష‌యంలో జాగ్ర‌త్త‌గా ఉండాలి

బుధుడు, సంయోగం వల్ల ఈ వారం మీరు చెబుతున్న ప్రతి మాట, మీరు చేసే ప్రతి చర్య పట్ల జాగ్రత్త అవసరం. అనవసరమైన చర్చలు, విమర్శలు మంచివికావు. చంద్రుని ప్రభావం కుటుంబ విషయాల్లో మానసిక ఒత్తిడిని పెంచవచ్చు. కాబట్టి ప్రతి విషయంలో సంయమనం, ఆలోచనాత్మకంగా స్పందించడం అవసరం.

ఈ రాశి వారికి ఈ వారం స్కైబ్లూ, ఊదా రంగు క‌లిసొస్తుంది. అదృష్ట సంఖ్యలు 4, 8. ఈ వారం కుంభరాశి వారికి "ఆలోచించి మాట్లాడటం. ఆచరించేముందు విశ్లేషించడం" అనే ధోరణి మంచిది.

Read more Photos on
click me!

Recommended Stories