శ్రావణ మాసంలో..
వేద క్యాలెండర్ ప్రకారం.. శ్రావణ మాసాన్ని శివుడికి అంకితం చేస్తారు. ఈ సమయంలో విష్ణుమూర్తి యోగనిద్రలో ఉంటాడు. కాబట్టి.. ఈ సమయంలో అంటే శ్రావణ, కార్తీక మాసాల్లో లోకం మొత్తాన్ని చూసుకునే బాధ్యత శివుడిపై ఉంటుంది. అందుకే శ్రావణ, కార్తీక మాసాల్లో శివయ్యకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు. అంతేకాకుండా, శ్రావణ మాసంలో లక్ష్మీదేవికి కూడా పెద్ద పీట వేస్తారు. శ్రావణ శుక్రవారాల్లో లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజిస్తూ, వరలక్ష్మీ వ్రతం కూడా చేసుకుంటారు. కాగా.. ఈ శ్రావణ మాసంలో జోతిష్య పరంగా కూడా చాలా మార్పులు జరగనున్నాయి.